ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏకంగా ఇన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు వ‌దిలేశాడా… అన్నీ సూప‌ర్ హిట్లే…!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని దాటుకొని పవర్ స్టార్ గా ఎదిగి అన్నను మించిన తమ్ముడుగా టాలీవుడ్‌లో రాణిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎంతో కీలకంగా ఉన్నారు. ఇదే సమయంలో రాజకీయాల్లోనే ఉంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు ఓ పండగ లాగా ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన పాతికేళ్ల సినీ కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించారు మరికొన్ని సినిమాలను వదులుకున్నాడు. అలా వదులుకున్న లిస్టులో కొన్ని ప్లాప్ సినిమాలు ఉంటే మరికొన్ని బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే పవన్ వదులుకున్న వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం రండి.

ఇడియట్:
రవితేజ హీరోగా 2002లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ముందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయాలని అనుకున్నారట. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో. ఈ ఆఫర్ రవితేజను వరించింది.

అమ్మానాన్న ఓ తమిళమ్మాయి:
ఈ సినిమాను కూడా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నాడట. కీక్ బాక్సింగ్ చుట్టూ తిరిగే ఈ కథ పవన్ కళ్యాణ్‌కు నచ్చింది కానీ ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ కుదరలేదు. దాంతో ఈ సినిమా కూడా రవితేజ ఖాతాలో పడిపోయింది.

అతడు:
త్రివిక్రమ్ ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ ఇది.. ఈ సినిమాలో పార్ధు క్యారెక్టర్ కు ముందుగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నాడట త్రివిక్రమ్.ఆయనకు స్టోరీ చెప్పే సమయంలో పవన్ నిద్రపోయి ఈ సినిమా వినకుండా రిజెక్ట్ చేశాడట.

పోకిరి :
ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాల్సింది. డేట్స్ సెట్ అవ్వక మిస్ అయ్యింది. మ‌హేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ గా నిలిచిన ఈ సినిమా పవన్ కి పడి ఉంటే ఇంకా హిట్ అయ్యి ఉండేది.

విక్రమార్కుడు:
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `విక్రమార్కుడు`కి ఫ‌స్ట్ ఛాయిస్ ప‌వ‌న్ క‌ళ్యాణే. క‌థ కూడా విన్న ప‌వ‌ర్ స్టార్.. ఇత‌ర ప్రాజెక్ట్‌ల కార‌ణంగా విక్ర‌మార్కుడును మిస్ చేసుకున్నాడు. క‌ట్ చేస్తే ర‌వితేజ న‌టించిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది.

ఇలా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలనే కాకుండా తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే కావాలి, వెంకటేష్ – మహేష్ బాబు కలిసిన నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిరపకాయ్ ఇలా ప‌వ‌న్ త‌న కెరీర్‌లో మొత్తానికి ఈ బ్లాక్‌ బ‌స్ట‌ర్ సినిమాల‌ను పవన్ కి పడి ఉంటే.. పవన్ క్రేజ్ మ‌రో రేంజ్ ఉండేది.