స్టార్ క్రికెట‌ర్లు.. మ‌హిళా క్రికెట‌ర్లు ప్రేమ పెళ్లిళ్లు…!

మ‌న దేశంలో భారీ క్రేజ్ ఉన్న ఆట క్రికెట్. ఈ ఆట ఆడే ఆటగాళ్లకి కూడా అదే స్థాయిలో భారీ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. వారి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం మీరు చదివే ఆర్టికల్ లో లేడీ క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్లు ఎవరో ఒకసారి చూద్దాం. ఇక ఈ లిస్టులో ధోని శిష్యుడు కూడా ఉన్నాడండో.. అతను ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ఒకసారి చదివేయండి.

రోజర్ ప్రిడోక్స్, రూత్ వెస్ట్‌బ్రూక్:
ఇక వీరిద్దరూ ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు.. వీరు ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేదు కానీ ఇంగ్లాండ్ తరఫున రూత్ 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 476 పరుగులు చేయగా, ఆమె భర్త రోజర్ మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడారు. ఆయన కెరీర్లో ఓ ఆఫ్ సెంచరీ తో పాటు మొత్తంగా 102 పరుగులు చేశాడు. అయితే రోజర్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 25,000 కంటే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం.

రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష పవార్‌:
ధోనీ ప్రియ శిష్యుడైన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మహారాష్ట్ర రైజింగ్ స్టార్ ఉత్కర్షను రీసెంట్‌గా వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి గైక్వాడ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ లో స్టాండ్‌బై ప్లేయర్లలో ఒకడిగా ఎంపికయ్యాడు. అయితె పెళ్లి కోసం రుతురాజ్ జట్టుని వదిలేసాడు. ఇందుకు బీసీసీఐ కూడా ఒప్పుకుంది.

మిచెల్ స్టార్క్, అలిస్సా హీలీ :
మిచెల్ స్టార్క్, అలిస్సా హీలీ ఇద్దరూ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. ఆసీస్ గెలిచిన అనేక టోర్నీల్లో వీరిద్దరూ ఉన్నారు. ఇక ఈ జంట‌ ఆస్ట్రేలియన్ పవర్ కపుల్ కొన్ని అవార్డ్ ఫంక్షన్లలో కూడా తరచుగా కనిపించి సందడి చేస్తుంటారు.

గైడి అల్విస్, రసాంజలి సిల్వా:
శ్రీలంక మాజీ వికెట్ కీపర్ గై డి అల్విస్, ఆ దేశ ఉమెన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రసాంజలి సిల్వాను పెళ్లి చేసుకున్నాడు. రసాంజలి సిల్వా శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తరఫున ఒక టెస్టు, 22 వ‌న్డేలు ఆడింది. రెండు ఫార్మాట్లలో కలిపి ఈమె 31 వికెట్లు కూడా తీసింది. రిటైర్మెంట్ తర్వాత సిల్వా శ్రీలంక మహిళల జట్టుకు సెలక్టర్‌గా కూడా పనిచేసింది. అయితె ఆమె భ‌ర్త‌ 2013లో 52 సంవత్సరాల వయసులో చనిపోయాడు.