పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న నలుగురు స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్లో మహేష్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ 45 ఏళ్ళ వయసు దాటేస్తోన్నా ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా సినిమాల్లో నటించి మరిన్ని హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మహేష్ ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా సినిమాలో కూడా నటించలేదు. అయినా టాలీవుడ్ లో వరుస సినిమాలతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు. మహేష్ నటించి బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో పోకిరి ఒక‌టి.

Pokiri - Wikipedia

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో ఏకంగా రు. 50 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చి పెట్టింది. మహేష్ బాబు నటించిన అన్ని సినిమాల్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాలో నాజుకు నడుము సుందరి ఇలియానా తన నడుమొంపులతో కోట్లాదిమంది కుర్ర కారుకు పిచ్చెక్కించేసింది.

పోకిరి సినిమాలో హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ న‌లుగురు హీరోయిన్లు మిస్ చేసుకున్నార‌ట‌.. పోకిరి సినిమాకు హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ ఇలియానా కాదట. ఇలియానాను ఈ సినిమాకు సెలెక్ట్ చేసేముందు నలుగురు హీరోయిన్లను అడిగాడ‌ట‌ పూరి జగన్నాథ్. అయితే ఈ పాత్ర కోసం ముందుగా కంగనా రనౌత్ ని సంప్రదించగా ఆమె వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండి ఈ సినిమాను రిజెక్ట్ చేసింది.

Will Mahesh Babu's 'Pokiri' come back to theatres on account of his birthday? | Telugu Movie News - Times of India

ఆ తర్వాత దీపికా పదుకొనే, పార్వతి మెల్టన్, అయేషా ట‌కియా లాంటి హ‌ట్ హీరోయిన్లను పూరి జగన్నాథ్ అడ‌గ‌గా వాళ్ళందరూ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అప్పటికే దేవదాసు సినిమాతో హిట్ కొట్టిన ఇలియానాకు ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్ ప‌దేళ్ల పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్గా వెలిగింది.