రాహుల్ సిప్లిగంజ్ ఇంట మోగిన పెళ్ళి భాజ.. పెళ్లి కి హాజరైన స్టార్ ప్రముఖులు..మనోడి రేంజే వేరే లెవల్..!!

రాహుల్ సిప్లిగంజ్ .. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . గల్లీ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత తనలోని టాలెంట్ను ఒక్కొక్కటిగా బయట పెడుతూ .. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ స్టేజిపై పెర్ఫార్మెన్స్ చేసి గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమాల్లో నాటు నాటు పాట పాడినందుకు రాహుల్ సిప్లగంజ్ కాలభైరవకు ఆస్కార్ అవార్డు వరించింది .

Celebrities At Rahul Sipligunj Brother wedding photo Goes Viral - Sakshi

కాగా ఈ క్రమంలోనే ఆస్కార్ స్టేజిపై రాహుల్ సిప్లిగంజ్ పాట పాడడంతో తన పేరు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకుంది . రీసెంట్ రాహుల్ సిప్లిగంజ్ తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహం చేసుకుంటున్నాడు. ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ అధికార విపక్ష నాయకులు మొత్తం హాజరయ్యారు . టిఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు – తలసాని శ్రీనివాసరావుతో పాటు మరి కొంతమంది ప్రముఖులు ఫంక్షన్ కి హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Singer Rahul Sipligunj Brother Nikhil Marriage, Photos Goes Viral - Sakshi

ఈ క్రమంలోనే రాహుల్ సిప్లిగంజ్ పిలిచిన వెంటనే ఈ స్థాయి నాయకులు పెళ్ళికి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిఖిల్ సిప్లిగంజ్ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనంతటికీ కారణం రాహుల్ సిప్లిగంజ్ లో ఉన్న టాలెంట్ అని ఆయన ఎక్కువగా అందరికీ మర్యాదలు ఇస్తూ ఉంటాడని,, మరీ ముఖ్యంగా ఆస్కార్ అందుకున్న తర్వాత రాహుల్ క్రేజ్ లెవల్ అన్ని మారిపోయాయని చెప్పుకొస్తున్నారు .

Celebrities At Rahul Sipligunj Brother wedding photo Goes Viral - Sakshi

ఏది ఏమైనా సరే తనదైన స్టైల్ లో తనదైన టాలెంట్ తో గల్లీబాయ్ నుంచి ఆస్కార్ వరకు వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ ఈ రేంజ్ ఫాన్ ఫాలోయింగ్ పెరగడం కారణం బిగ్ బాస్ అనే చెప్పాలి . బిగ్ బాస్ ద్వారానే రాహుల్ పేరు పాపులారిటీ లోకి వచ్చింది . ఆ తర్వాత రాహుల్పలు సినిమాల్లో పాడి తన గొంతుతో తన మాస్ లాంగ్వేజ్ తో తన తెలంగాణ యాసతో పాపులారిటీ తెచ్చుకున్నాడు . కాగా నిఖిల్ సిప్లిగంజ్ వివాహం చేసుకున్న అమ్మాయి పేరు నిధి అంటూ తెలుస్తుంది. అయితే వీళ్లది లవ్ మ్యారేజా..? ఆరేంజ్డ్ మ్యారేజా..? అన్నది ఇంకా తెలియ రాలేదు . ప్రెసెంట్ వీళ్ళ పెళ్లి పిక్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!