సోష‌ల్ మీడియాలో తిరుగులేని నెంబ‌ర్ 1 రికార్డ్ మ‌హేష్‌దే… ఏ హీరో ట‌చ్ చేయ‌లేరు…!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ల‌తో దూసుకుపోతున్నారు. గత ఏడాది పరశురామ్ దర్శకత్వంలో సర్కారి వారి పాట సినిమాలో నటించిన మహేష్ మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం మాటల‌ మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కెరీర్లో 28వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Mahesh Babu clarifies 'Bollywood cannot afford him' remark, says he loves  cinema and respects all languages – ThePrint – ANIFeed

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక మహేష్ బాబుకి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో తెలిసిందే ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఎప్పటినుంచో భారీ క్రేజ్ తో పాటు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్లో అయితే లక్షకి పైగా లైకుల‌ పోస్టులు ఉన్న ఏకైక హీరోగా మహేష్ బాబు ఇప్పటికే ఎన్నోసార్లు రికార్డు క్రియేట్ చేశారు.

Mahesh Babu heaps praises on 'Bheemla Nayak', Pawan Kalyan - Telugu News -  IndiaGlitz.com

ఇంతటి క్రేజ్ ఉన్న మహేష్ సోషల్ మీడియాలో మరో అదిరిపోయే క్రేజీ ట్విట్ కూడా నమోదు చేశారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అలాగే ఫేస్‌బుక్‌లో పది మిలియన్ల‌ ఫాలోవ‌ర్స్ కలిగిన ఏకైక టాలీవుడ్ హీరోగా మహేష్ రికార్డుల్లోకి ఎక్కాడు. రీసెంట్గా మహేష్ ఇన్‌స్టాగ్రామ్ లో పది మిలియన్ ఫాలోవర్లను క్రాస్ చేశాడు. ఇలా ఈ మూడు సోషల్ మీడియా వేదికలలోనూ 10 మిలియన్ల ఫాలోవర్లో ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. మహేష్ కు దరిదాపుల్లో ఏ సౌత్ ఇండియన్ హీరో కూడా లేడు అంటే మహేష్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, mahesh babu, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news