మంచు ఫ్యామిలీలో తారాస్థాయికి విబేధాలు… విష్ణు ర‌చ్చ‌పై క‌ట్ట‌లు తెంచుకున్న మ‌నోజ్ ఆగ్ర‌హం (వీడియో)

మంచు ఫ్యామిలీలో అన్నదమ్ములు మంచి విష్ణు, మంచి మనోజ్ మధ్య ఏవో డిఫరెన్స్ ఉన్నాయని కొద్దిరోజులుగా పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన మంచి మనోజ్ పెళ్ళికి విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని ప్రచారం జరిగింది. పెళ్లిలో అంతా మంచు లక్ష్మి హడావుడి కనిపించిందే తప్ప మంచి విష్ణు ఈ పెళ్లిలో పెళ్లి టైం కి వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడే చాలామందికి అనుమానాలు కలిగాయి. మనోజ్ పెళ్లి జరిగి పది రోజులు అయిందో లేదో వీరిద్దరి మధ్య ఉన్న వివాదం గాలివానగా మారినట్టు తెలుస్తోంది.

Wedding functions begin at Lakshmi Manchu's Hyderabad home

మనోజ్ మనిషి అయిన సారధి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేయడానికి వచ్చాడంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన మనోజ్.. ఇదండీ అసలు విషయం.. ఇలా ఇంటికి వచ్చి మా వాళ్ళని కొడుతుంటాడు అంటూ మనోజ్ వాయిస్ ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. వాడేదో అంటున్నాడు కదా అని విష్ణు ముందుకు దూసుకురావడం.. అతడిని ఓ ఇద్దరి మిత్రులు ఆపే ప్రయత్నం కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

Manchu Vishnu Reveals He#8217;s More Afraid of Wife Viranica than His Own  Father - Vishnu, Tollywood, Viranica, Viranica Manchu, Vishnu Manchu,  Anniversary |

అయితే అన్నదమ్ముల గొడవపై తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గురువారం రాత్రి సారథి ఇంట్లో ఏం జరిగిందో ? అని ఆరా తీస్తున్నారు మోహన్ బాబు. ముందు వీడియో డిలీట్ చేయమని మనోజ్ కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో మనొజ్ ఫేస్బుక్ స్టేటస్ డిలీట్ చేశాడు. ఇక అన్నదమ్ముల గొడవపై ఓ ప్రముఖ చానల్ తో మాట్లాడిన మోహన్ బాబు ఆవేశం అన్నింటికీ అనర్ధం.. వాళ్ళింకా అది తెలుసుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యనించారు.

Manchu Manoj, Mounika Reddy marry in Hyderabad. See first wedding pics -  Hindustan Times

అలాగే ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మోహన్ బాబు తెలిపారు. ఇక అన్నదమ్ములు ఇద్దరి మధ్య గొడవ ఇప్పుడు జరిగిందా ? లేదా గత కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఇప్పుడు ఎక్కువ ? అయ్యాయా అన్నది తెలియడం లేదు. అలాగే మోహన్ బాబు తన ఇద్దరు కొడుకుల్లో ఎవరికి మద్దతుగా ఉన్నారు అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఏదేమైనా మంచు వారసులు ఇద్దరి మధ్య రెండు.. మూడేళ్లుగా ఈ గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు మూడు సంవత్సరాలుగా అన్న విష్ణుకి… మనోజ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పడం లేదు. అలాగే మనోజ్ పెళ్ళికి విష్ణుతో పాటు ఆయన భార్య వెరోనిక చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయారు. అయితే వీరిద్దరి మధ్య అంత తీవ్రమైన విభేదాలు రావడానికి కారణం ఏంటన్నది ? తెలియాల్సి ఉంది.

 

Tags: film news, intresting news, latest news, latest viral news, manchu manoj, manchu vishnu, manoj manchu, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news, vishni manchu