ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు టాప్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్‌… కోట్ల‌మందికి రోల్ మెడ‌ల్‌…గుర్తుప‌ట్టారా..!

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ట్రెండ్ పేరుతో వైరల్ అవుతున్నాయి. ఈ పైన గిటార్ ప్లే చేస్తూ కనిపిస్తున్న ఆ కుర్రాడు ఓ ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌. ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం యువతకు ఆదర్శంగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త భారతదేశంలో దేశీయ వాహన తయారీ దిగ్గజం ఆనంద్‌ మహేంద్ర. మహేంద్ర కంపెనీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆనంద్‌ మహేంద్ర గురించి తెలుస్తుంది.

ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగినా ఆనంద్‌ మహేంద్ర ట్విట్టర్ వేదిక ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాడు. ప్ర‌స్తుతం ఆనంద్ మహేంద్ర ఎలా ఉన్నాడు అనేది దాదాపు చాలామందికి తెలుసు. కానీ చిన్న వయసులో మహేంద్ర ఎలా ఉన్నాడు అనేది చాలా వరకు తెలియదు. ఇక ప్రస్తుతం ఆనంద్ మహేంద్రా చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పైన ఉన్న‌ ఫొటోల‌లో మీరు గమనించినట్లయితే ఆనంద్ మహేంద్ర గిటార్ వాయిస్తూ ఉండడం కనపడుతుంది. 1973లో రిలీజ్ అయిన ఓ మలయాళీ పాట పాడుతూ కనిపిస్తాడు. ఇందులో బ్రిటిష్ కుటుంబానికి చెందిన పిల్లలు కూడా ఉన్నారట. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆనంద్ మహేంద్రా యువకుడుగా ఉన్నప్పుడు ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .