ఐపీఎల్ 2023లో ఈ 4 గురు క్రికెట‌ర్లు ఇచ్చిన అతి పెద్ద స‌ర్‌ప్రైజ్… బంప‌ర్ ట్విస్ట్ అంటే ఇదే..!


ఐపీఎల్ 2023 సీజన్లో కొన్ని అద్భుతాలు జరిగాయి కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్టార్ క్రికెటర్లు దారుణంగా ఫెయిల్‌ అయ్యారు. అయితే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి అదరగొట్టేశారు. కొందరు వెటర‌న్‌ క్రికెటర్లు అనూహ్యంగా సత్తా చాటారు. వీరిలో చాలామంది తమ గతానికి భిన్నంగా అద్భుతమైన ఆటతీరుతో ఐపీఎల్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచేత్తారు. కొందరు ఈ వయసులో కూడా తమ దూకుడు ప్రదర్శించి తమ జట్ల గెలుపులో కీలక పాత్ర పోషించారు.

From net bowler last season to man of the moment for GT: Mohit Sharma  finding his

లేటు వయసులోనూ ఏమాత్రం తగ్గకుండా అద్భుత ప్రదర్శనలు చేసిన ఓరి నలుగురు ఆటగాళ్లు ఈ ఐపీఎల్ లో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాలి. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మెహిత్ శర్మ. సరైన అవకాశాలు లేక చాలాకాలంగా టీమిండియాతో పాటు ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు. 34 ఏళ్ల మెహిత్ ను గుజరాత్ టైటాన్స్ కేవలం 50 లక్షలకు సొంతం చేసుకుంది. అందరి ఇంచనాలు తలకిందులు చేస్తూ మెహిత్ శర్మ ఏకంగా 13 మ్యాచ్‌ల‌లో 24 వికెట్లు తీశాడు.

Mens Team | IPLT20

ముంబైతో జరిగిన క్వాలిఫైయర్ 2 లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి 10 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇక 35 ఏళ్ల వెటర‌న్ అజ్యంకా రహానేను చెన్నై కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. రహానే కసితో ఆడి చెన్నై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 13 మ్యాచ్‌ల్లో రెండో అర్థ సెంచ‌రీల‌తో 299 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే రహానేకు టీమిండియాలో కూడా చోటు దక్కింది.

Piyush Chawla: I must have done something right to be among the top  wicket-takers | Cricket News - Times of India

ఇక 35 ఏళ్ల వెట‌ర‌న్ పియూష్ చావ్లా కూడా 16 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు ప‌డ‌గొట్టి ముంబై క్వాలీఫ‌యింగ్ వ‌ర‌కు రావ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఇక 35 ఏళ్ల వెట‌ర‌న్ ఇషాంత్ శ‌ర్మను ఢిల్లీ క‌నీస ధ‌ర రు. 50 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు ప‌డ‌గొట్టి ఓ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. ఏదేమైనా ఈ న‌లుగురు వెట‌రన్లు ఈ సారి ఐపీఎల్లో అదిరిపోయే స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చారు.

Ishant Sharma reveals Jasprit Bumrah's 2018 advice