మగవారి కంటే హార్ట్ ఎటాక్ ఆడ‌వాళ్ల‌కే ఇంత డేంజ‌రా… భ‌యంక‌ర నిజాలు ఇవే…!

చాలామంది మగవారిలోనే హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా ఉంటాయని.. హార్ట్ ఎటాక్ వల్ల నష్టపోయేవారు, చనిపోయేవారిలో మగవారే ఎక్కువ ఉంటారని అనుకుంటారు. అయితే అది చాలా తప్పట.. ఎస్ ఇటీవల జరిగిన ఒక సైంటిఫిక్ పరిశోధన ద్వారా కొంతమంది పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. గుండెపోటు తర్వాత చనిపోయే అవకాశాలు పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా ఉంటాయ‌ట‌.

దానికి ప్ర‌ధాన‌ కారణం ఆడవారిలో ముఖ్య‌మైన‌ హాట్ వెజల్ట్స్ దెబ్బ తినడంతో పాటు.. గుండెకు సంబంధించిన ప‌రీక్ష‌ల్లో అనుకులంగా ఫ‌లితాలు రాక మహిళల్లోనే చనిపోయే ముప్పు ఎక్కువగా కనిపిస్తుంద‌ట. హార్ట్ ఎటాక్ తర్వాత వింత లక్షణాలు, జన్యు పొజిషన్ వంటి అంశాలే మగవారి కంటే ఆడవారు చనిపోవడానికి ఎక్కువగా దోహదం చేస్తున్నాయ‌ని పరిశోధకులు వెల్లడించారు.

ప్ర‌తి ఒక్క‌రు మారుతున్న కాలానుగుణంగా హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు వెల్లడించారు. ప్ర‌తి రోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలని.. జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో పనిగాని, తోటలో పని గాని చేస్తూ ఉండాలని.. 35% శరీరానికి తగ్గ శ్రమలేకపోవడం వల్లనే హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఇక శ‌రీరానికి త‌గిన శారీర‌క శ్ర‌మ‌తో పాటు సరైన ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలని నిపుణులు త‌మ తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడించారు.