ఆ స్టార్‌ హీరోయిన్‌ని టార్చ‌ర్ పెట్టి హింసించిన రాఘ‌వేంద్ర‌రావు… చివ‌ర‌కు మందు కూడా తాగ‌మంటూ..!

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు హీరోయిన్లు పిండేయడం సర్వసాధారణం. అది డైరెక్షన్ పరంగా లేదా మరేదైనా కావ‌చ్చు. కొందరు డైరెక్టర్లు సినిమాలో హీరోయిన్లు యాక్టింగ్ పరంగా పిండేస్తే .. మరికొందరు డైరెక్టర్లు ఇంకోరకంగా పిండుతారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు మాత్రం హీరోయిన్ నగ్మాను ఓ రేంజ్‌లో వాడేసుకున్నారట. ఎంతలా అంటే నగ్మా ఇక నేను రాఘవేంద్రరావు డైరెక్షన్లో సినిమాలు చేయను రా బాబోయ్ అన్నంతగా ఆమెను పిండేసాడ‌ట‌. ఇందులో అపార్ధాల‌కు తావులేదు.. ఇది న‌ట‌నా ప‌రంగా పిండుకున్న‌దే.

Sarada Bullodu - Chitha Karthelo Chinukulu Chitapata - Venkatesh Nagma -  video Dailymotion

మనకు తెలిసిందే డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో సినిమాలు అంటే ఎంతో కఠినంగా ఉంటుంది . ఆయన అనుకున్న ఎక్స్‌ప్రెష‌న్స్ రాకపోయినా… ఆయన చెప్పిన విధంగా చేయకపోయినా ..కోప్పడిపోతారు. ఈ విషయం టాలీవుడ్‌లో అందరికి తెలిసిందే. కే రాఘవేంద్రరావు సినిమాలో నటించాలని చాలామంది హీరోయిన్లు ఎంతో ఆశపడుతారు. ఎందుకంటే ఏ డైరెక్టర్ చూపించని విధంగా రాఘవేంద్రరావు తన సినిమాలో హీరోయిన్తని ఎంతో స్పెషల్ గా చూపిస్తార‌న్న‌ది అందరికీ తెలిసిందే.

రకరకాల పండ్లను, పూలను హీరోయిన్ల‌ బాడీ పార్ట్స్ పై వేసి స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తారు. ఇప్పటివరకు రాఘవేంద్రరావు తన కెరీర్ లో 110 సినిమాల‌కు పైగా తెరకెక్కించారు. ఎంతోమంది హీరోయిన్లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన డైరెక్షన్లో ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం అతిలోకసుందరి శ్రీదేవినే. శ్రీదేవి – రాఘవేంద్రరావు కాంబోలో సినిమా వస్తుందంటేనే ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి.

Gharana Mogudu Telugu Movie | Clapnumber

వీరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇదే క్రమంలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలలో శ్రీదేవి తర్వాత బాగా దగ్గరైన హీరోయిన్ ఎవరు ? అంటే నగ్మా అని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాఘవేందర్రావు డైరెక్షన్లో చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో నగ్మా హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ సమయంలో పాపం నగ్మాని రాఘవేందర్రావు చాలా ఇబ్బంది పెట్టేసాడట.

మరి ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ‘ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు ‘.. అనే సాంగ్ షూటింగ్ టైంలో నగ్మని ఓ రేంజ్ లో ఆడుకున్నాడట రాఘవేంద్రరావు. ఈ పాటలో చీరపైకి ఎత్తి మాస్ స్టెప్పులు వేయడం నగ్మాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదట. అయినా కానీ రాఘవేంద్ర‌రావు దగ్గరుండి మ‌రీ ఆమెతో మాస్ స్టెప్స్ వేయించారట. అంతేకాకుండా తాగుతూ తూలుతూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటూ నిజంగానే మందు తాగమని సజెస్ట్ చేశారట.

Gharana Mogudu Full Movie - Part 1-13 - Chiranjeevi, Nagma, Vani Viswanath  - HD - video Dailymotion

అంతేకాకుండా ఈ సినిమా కోసం చిరంజీవితో డైరెక్టుగా లిప్ కిస్ పెట్టించ‌ర‌ట‌. రాఘవేందర్రావు మిగతా ఏ హీరోయిన్ ని ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదట .కేవలం నగ్మాను మాత్రమే ఈ సినిమా కోసం అంతలా టార్చర్ చేసారట. ఆ కారణంగానే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని.. ఆ విధంగా నిర్మాతలకు ప్రాఫిట్స్ తీసుకొచ్చిందని చెప్పుతుంటారు జనాలు.