ఆ స్టార్ హీరోయిన్ మ‌హాన‌టి సావిత్రి మనవరాలు… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

పాత త‌రం హీరోయిన్ల‌లో ఎంతోమంది ఉన్నా ఇప్ప‌ట‌కీ గొప్ప మ‌హాన‌టిగా చ‌రిత్ర‌లో మిగిలిపోయిన న‌టి మహానటి సావిత్రి. అయితే ఇప్పుడున్న జనరేషన్ కి సావిత్రి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా ద్వారా ఆమె గొప్పతనం అందరికీ తెలిసింది. ఆవిడ మనవరాలు కూడా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ?ఇప్పుడు చూద్దాం.

సావిత్రి ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అలాగే ఆస్తులు కూడా భారీ ఎత్తున సంపాదించింది. అలాంటి సావిత్రి అప్ప‌టికే పెళ్ల‌య్యి పిల్ల‌లు ఉన్న జెమినీ గణేష్ ని ప్రేమించి పెళ్లాడింది. సావిత్రి కెరీర్‌లో చేసిన పెద్ద త‌ప్పు ఇదే. ఆ తరువాత ఆమెకి కూతురు విజయ ఛాముండేశ్వరి, కొడుకు సతీష్ జన్మించారు. ఆమె కూతురు విజయ‌ ఛాముండేశ్వరి ఇప్పటికి కూడా సావిత్రి గొప్ప‌త‌నం గురించి ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెపుతూ ఉంటారు.

ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సావిత్రికి ఏమాత్రం గర్వం, అహంకారం, కోపం ఇలాంటివి ఏమీ లేవని చెప్పొచ్చు. ఆమె మనవరాలు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో ? కాదు విజయ చాముండేశ్వరి కోడలు మ‌ధువంతి. ఆమె తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది. ధ‌ధువంతి తమిళ్లో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ గొప్ప పేరు సంపాదించుకుంది.

ఆ త‌ర్వాత ఆమె బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చి ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టిస్తోంది. మొత్తానికి సావిత్రి అంత ఎత్తుకు ఎదగాలని ఆవిడ మనవరాలు కోరుకుంటూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.