ఎన్టీఆర్‌కు ఎదురెళ్లి మ‌రీ ప‌రువు తీసుకున్న కృష్ణ‌… ఆ రెండు సినిమాల పోటీలో జ‌రిగింది ఇదే..!

సీనియర్ ఎన్టీఆర్ జనాల్లో ప్రత్యేకమైన గౌరవం సంపాదించుకున్నారు. ఆయన కెరియర్ లోని “దానవీరశూరకర్ణ”ప్రత్యేకమైన తెచ్చింది. అప్పట్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ సినిమా ఎన్టీఆర్ ఇమేజ్ మరో స్థాయికి పెంచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్, డైలాగ్స్ అభిమానులు గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. దానవీరశూరకర్ణ సినిమాకి ఎన్టీఆర్ దర్శకత్వం వ‌హించ‌డంతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు మూడు పాత్రలోనూ నటించాడు.

దాదాపుగా 226 నిమిషాలు కలిగిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రు.10 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించారు. అప్పట్లో దాదాపు ఒకటిన్నర కోట్లు వసూలు చేసింది ఈ సినిమా 226 నిమిషాల పాటు పెద్ద సినిమాగా ఉన్నా ప్రజలు ఏమాత్రం విసుగు చెందకుండా చాలా ఆసక్తిగా చూసి సూప‌ర్ హిట్ చేశారు. విచిత్రం ఏంటంటే 1994లో క‌ర్ణ‌ను రీ రిలీజ్ చేయగా మళ్లీ 100 రోజులు ఆడింది.

అయితే దాన‌వీర శూర‌క‌ర్ణ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ ఎదురెళ్లి బాగా నష్టపోయారు. ఒకవైపు దానవీరశూరకర్ణ సినిమా చేస్తుంటే మరోవైపు మహాభారతం స్టోరీని తెరకెక్కించడానికి సినిమా పనులు స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు కురుక్షేత్రం అనే టైటిల్ అనుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ “అర్జునుడిగా”శోభన్ బాబు “కృష్ణుడిగా”కృష్ణం రాజు “కర్ణుడిగా”పాత్రలు వేశారు.

1977 జనవరి 14న సంక్రాంతికి కానుకగా దానవీరశూరకర్ణ ,కురుక్షేత్రం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొట్టుకున్నాయి. కానీ దానవీరశూరకర్ణ సినిమా సూప‌ర్‌ హిట్ సాధించింది. కురుక్షేత్రం డిజాస్టర్ కాగా కృష్ణ ఎన్టీఆర్ ముఖం కూడా చూడలేకపోయారట. అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తున్నప్పుడు కృష్ణకి, ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు మ‌రింత ముదిరాయి.

ఆ త‌ర్వాత ఎన్టీఆర్ త‌ప్పులు చూపిస్తూ కృష్ణ మరికొన్ని సినిమాలు చేశారట. ఇంకా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణ ఆయన మీద సెటైర్ల‌తో కొన్ని సినిమాలు చేశారు.