అప్ప‌ట్లో సీనియ‌ర్ ఎన్టీఆర్ ఆహార‌పు అల‌వాట్లు చూస్తే క‌ళ్లు తిరుగుతాయ్‌… అంత తిండి తింటారా…!

ఇప్పసీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తేనే ప్రజలలో ఒక అభిమానం పుట్టుకొస్తుంది. ఆయ‌న చ‌నిపోయి 30 ఏళ్లు అవుతున్నా కూడా టికి ఆయనని మర్చిపోరు. స్వయంకృషితో హీరోగా, నిర్మాతగా, దర్శకుడుగా సినీ ఇండస్ట్రీలో ఓ గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పిన నటుడు ఎన్టీఆర్‌ అని సినీ ఇండస్ట్రీ జ‌నాలు భావిస్తారు. ఇప్పటికీ కూడా ప్రజలు ఓ కృష్ణుడు, ఓ రాముడు, ఓ విశ్వామిత్రుడు అంటే కేవ‌లం సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని అంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వచ్చినా కూడా సీనియర్ ఎన్టీఆర్ నటించినట్లు మ‌రే హీరో నటించలేడు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్న రోజుల్లో మిగతా వారి కంటే చాలా ప్రత్యేకంగా ఉండేవార‌ట‌. ఆయన ఏ పని చేసినా కచ్చితంగా సమయం వృధా కాకుండా చూసుకునే వారట. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పోయే వరకు ప్రతి పనికి టైం ఫాలోయింగ్ అయ్యేవారట.

ఓ పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆయన ఆహారం విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించే వారట. అప్పట్లో ఎన్టీఆర్ ఆహారం ఏం తినేవారో చూద్దాం. ఆయన ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు యోగ చేసేవారట. ఆ తర్వాత టిఫిన్ లో బాగా నెయ్యి వేసుకొని రోజుకు క‌నీసం 20కు పైగా ఇడ్లీలు తినేవారట.

ఒక్కోసారి షూటింగ్లో వేరే ప్రాంతంలో ఉండడం వల్ల త‌న‌కిష్టమైన టిఫిన్ లేకపోతే భోజనం తినేవారట. ఆ భోజనంలో కూడా ఖచ్చితంగా నాటుకోడి కూర ఉంటేనే భోజనం చేసేవారట. ప్రతిరోజు సాయంత్రం పూట 2 లీట‌ర్ల బాదంపాలు తాగేవారట. ఎన్టీఆర్ చెన్నైలో ఉన్న సమయంలో బజ్జీలు తినడానికి చాలా ఇష్టపడేవారు. వేడివేడి బజ్జీలు క‌నీసం 10 బ‌జ్జీలు తినేవారట. ఆయ‌న‌ సినిమా అయినా, నిజ జీవితమైనా క్రమశిక్షణగా ఉండాలని భావిస్తారు.