ఆ 5 సీట్ల‌లో టీడీపీ గెలుపు ఇంకా క‌ల‌గానే మిగ‌ల‌నుందా…!

ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి తెలిసిందే.. పేరుకే చంద్రబాబు సొంత జిల్లా గాని ఇక్కడ టి‌డి‌పి పెద్దగా సత్తా చాటలేకపోతుంది. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో టి‌డి‌పికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2014లో రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉంది..కానీ చిత్తూరులో 14 సీట్లలో టి‌డి‌పి 6 సీట్లు మాత్రమే గెలుచుకోగా, వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది.

File:Telugu Desam Party Flag.png - Wikimedia Commons

అంటే చిత్తూరులో వైసీపీ ఆధిక్యం ఉంది..2019 ఎన్నికల్లో చిత్తూరులో పూర్తిగా వైసీపీ డామినేషన్..14కి 13 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పి కేవలం ఒక కుప్పం సీటులో మాత్రమే గెలుచుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి..కానీ చిత్తూరులో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఏదో నాలుగైదు స్థానాల్లో తప్ప..మిగిలిన స్థానాల్లో వైసీపీ హవా తగ్గడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టి‌డి‌పి నేతలు ఉంటున్నారు.

 

లేటెస్ట్ సర్వేలో కూడా జిల్లాలో 14 సీట్లు ఉంటే టి‌డి‌పి కేవలం 4 సీట్లలోనే గెలుపు అవకాశాలు ఉన్నాయి. నగరి, కుప్పం, మదనపల్లె, పలమనేరు సీట్లలోనే గెలిచే ఛాన్స్ ఉంది. వైసీపీ 8 సీట్లలో గెలుచుకునే ఛాన్స్ ఉంది. తిరుపతి, పుంగనూరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్ళపల్లె, చంద్రగిరి, చిత్తూరు సీట్లలో వైసీపీకి గెలుపు ఛాన్స్ ఉంది. ఇక పీలేరు, శ్రీకాళహస్తిలో టఫ్ ఫైట్ ఉంది. కొద్దిగా కష్టపడితే ఈ రెండు సీట్లు టి‌డి‌పి గెలుచుకునే ఛాన్స్ ఉంది.

 

అయితే మిగతా సీట్లలో టి‌డి‌పి ఇంకా కష్టపడాలి..టి‌డి‌పి ఎంత కష్టపడిన గెలుపు అవకాశాలు కలగానే ఉన్న సీట్లు వచ్చి..పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు, తంబళ్ళపల్లె సీట్లు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సీట్లలో గెలుపు అవకాశాలు టి‌డి‌పికి కల. ఇంకా గెలిచే ఛాన్స్ లేదు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp