చంద్ర‌బాబు జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టుల‌కు ఫిక్స్ చేసిన సీట్ల లెక్క‌లు ఇవే..!

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న టీడీపీ దానికి అనుగుణంగానే అడుగు లు వేస్తున్నదా? పొత్తులు పెట్టుకుని విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలుముమ్మ‌రం చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నా రు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో టీడీపీ క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకుని చేసిన ప్ర‌యోగం స‌క్సెస్ అయింది. దీనినే కంటిన్యూ చేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan's New Look From Remake of Vinodhaya Sitham Out

ఇప్పటికే 90 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను కూడా టీడీపీ ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టికే చంద్ర‌బాబు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశార‌ని.. అయితే.. బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేయ కుండా.. అంత‌ర్గ‌త ఆదేశాల్లో వారికి టికెట్ల విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేశార‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

 

ఉదాహ‌ర‌ణ‌కు రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌రిటాల సునీత‌, క‌ర్నూలు టీజీ భ‌ర‌త్‌.. ఇలా కీల‌క నేత‌ల‌కు మ‌రోసారి ఛాన్స్ ఇవ్వ‌డంతోపాటు.. గెలుస్తార‌నే న‌మ్మ‌కం.. ధీమా, ఖ‌ర్చుకు వెనుకాడ‌ని వారికిచంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో వారంతా కూడా ఇప్ప‌టికే త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని కూడా టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నికల్లో పొత్తుల విష‌యానికివ‌స్తే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగ‌డం ఖాయ‌మ‌ని భావి స్తున్న నేప‌థ్యంలో సుమారు 25 స్థానాల‌ను ఈ పార్టీకి కేటాయించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

File:CPI-M-flag.svg - Wikipedia

 

వీటిలో కీల‌క‌మైన తెనాలి, ఎచ్చెర్ల‌, రాజాం, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, గుడివాడ, కైక‌లూరు, ఏలూరు, భీమిలి, న‌ర‌సాపురం పార్ల‌మెంటు, న‌ర‌సాపురం అసెంబ్లీ స్థానాలు.. స‌హా మొత్తం 25 స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రో 5 స్థానాల‌ను క‌మ్యూనిస్టుల‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోందని చెబుతున్నారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 125 నియోజ‌క‌వ‌ర్గాల‌పై క్లారిటీ ఉంద‌ని.. మ‌రో 50 స్థానాల‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Buy PEACOCKRIDE Vote for Your Party I Communist Party of India (Marxist) I  CPIM Symbols Pin Badge Set of 75 No's (Metal, Multicolor, 37mm) Online at  Low Prices in India - Amazon.in

వీటిలోనూ 20 స్థానాల్లో అభ్య‌ర్థుల మ‌ధ్య‌ గ‌ట్టి పోటీ ఉన్న స్థానాల్లో ఆచి తూచి అడుగులు వేయ‌డ‌మో.. లేక‌.. చివ‌రివ‌ర‌కు ఉంచి.. అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డ‌మో చేయాల‌ని భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఏడాది ముందుగానే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం ద్వారా.. వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌కుండా.. చేయాల‌నే వ్యూహం కూడా ఉంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా క‌డ‌ప‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టాల‌ని తాజాగా నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికివ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ల‌క్ష్యంగా చంద్ర‌బాబు అడుగులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు.

Tags: AP, ap politics, communist, intresting news, janasena, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp