టీడీపీ మ‌హానాడు బ్లాక్‌బ‌స్ట‌ర్‌… సూప‌ర్ హిట్ కొట్టిన హీరో ఎవ‌రంటే…!

టీడీపీ ఘ‌నంగా నిర్వ‌హించిన మ‌హానాడు.. రెండు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా జ‌రిగింది. దాదాపు 31 ఏళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ రాజ‌మండ్రి వేదిక‌గా.. మ‌హానాడును నిర్వ‌హించారు. దీని వెన‌కాల పెద్ద సెంటిమెం టు ఉంద‌నే ప్ర‌చారం కూడా ఉంది. రాజ‌మండ్రిలో మ‌హానాడు పెట్టిన త‌ర్వాత‌.. పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. సో.. ఇప్పుడు ఆ సెంటిమెంటు కోస‌మ‌నే ఇక్క‌డ రెండు రోజుల పాటు మ‌హానాడు నిర్వ‌హించార ని సీనియ‌ర్లు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. 15 తీర్మానాల‌ను ఆమోదించారు. అదే స‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన వ‌చ్చే ఎన్నిక ల‌కు సంబంధించి చంద్ర‌బాబు మినీ మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకుంటే.. తొలి రోజు ప్ర‌తినిధుల స‌భ .. నుంచి రెండో రోజు కార్య‌క‌ర్త‌ల‌తో బ‌హిరంగ స‌భ వ‌ర‌కు భారీ ఎత్తున ప్లాన్ చేశారు. అనుకున్న విధంగానే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపించారు. కార్య‌క‌ర్త‌లు కూడా.. జోరుగా పాల్గొన్నారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హానాడు అంటే.. స‌భ్య‌త్వ న‌మోదుపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టేవారు. అదేవిధం గా పార్టీలో కొత్త చేరిక‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ సారి అది లేకుండా పోయింది. కొత్త‌గా స‌భ్య త్వం తీసుకున్న‌వారు.. కొత్త‌గా పార్టీలోకి చేరిన వారు కూడా క‌నిపించ‌లేదు. అయినా.. కూడా మ‌హానాడు దిగ్విజ‌యంగానే ముందుకు సాగింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇమేజ్ ఎవ‌రికి పెరిగింది.. అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

దీనిని ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు ఇమేజ్ మ‌రింత పెరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఇమేజ్ పెరిగింద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో పార్టీపైనా ప్ర‌జ‌ల్లో ఇమేజ్ పెరిగింద‌ని చెబుతున్నారు. మొత్తంగా రెండు రోజుల మ‌హానాడు ష‌డ్ర‌శోపేత‌మైన భోజ‌నాల‌కువేదిక‌గా మార‌డంతోపాటు.. అనేక డిక్ల‌రేష‌న్ల‌కు కూడా.. ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ కార్య‌క్ర‌మం అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా హిట్ట‌యింద‌న‌డంలో సందేహం లేదు.