“ఆ సినిమాలో నా నటన చూస్తే నాకే చిరాకు వేస్తుంది”.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

మిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో జైలర్ సినిమాతో మరో హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉంది. స్టార్ హీరో రజనీకాంత్ కలిసి ఆమె నటించిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె.. గతంలో ఆమె నటించిన ‘ సుర ‘ గురించి చెప్పుకొచ్చింది.

తమిళ్ హీరో విజయ్, తమన్నా కలిసి నటించిన చిత్రం సుర . ఈ చిత్రంలో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్న కూడా… సినిమా మాత్రం విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా గురించి తమన్నా మాట్లాడుతూ… “నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం… ఆ పాటలు ఇప్పటికీ నా మనసులో అలాగే ఉన్నాయి. కానీ అందులో కొన్ని సన్నివేశాల్లో నా నటన నాకే నచ్చలేదు”.

“అలాగే షూటింగ్ సమయంలోనే కొన్ని సీన్స్ సరిగ్గా రాలేదని నా మనసుకు అనిపించింది. కానీ నటుడు సినిమాను అంగీకరించిన తరువాత కచ్చితంగా దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సినీరంగంలో గలుపు, ఓటమి సంబంధం ఉండదు. ఈ ఇండస్ట్రీ చాలా ముఖ్యమైనది. అందువల్ల ప్రతివారు బాధ్యతగా ఉండాలి. ఇదంతా మన వ్యక్తిత్వంలో భాగం అనుకోవాలి” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.