ర‌వితేజను బాల‌కృష్ణ ర‌క్తం వ‌చ్చేలా కొట్టాడా… ఆ హీరోయిన్ మోసం చేసిందా.. అస‌లేం జ‌రిగింది…!

ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రవితేజ అంటే ఆ స్టార్ హీరోకి నచ్చదట. ఇంతకీ ఆ హీరో ఎవరు… ఆ హీరోకి ర‌వితేజ అంటే ఎందుకు ఇష్టం ఉండ‌దో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక గతంలో రవితేజ, బాలకృష్ణ మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఓ రోజు బాలయ్య ఏకంగా రవితేజని పిలిచి మరీ కొట్టాడని వార్తలు వైరల్ అయ్యాయి.

కానీ ఇది నిజం కాదని సమాచారం. ఇతర హీరో అభిమానులు వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూడలేక పుట్టించిన పుకారులు. అంతేకాకుండా రవితేజకి జంట‌గా భద్ర సినిమాలో న‌టించిన‌ మీరాజాస్మిన్ తో పరిచయం ఏర్పడిందని అది ప్రేమగా కూడా మారిందని ఫేక్ న్యూస్ కూడా వచ్చింది. అహలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో తొలి సీజన్ కు రవితేజ గెస్ట్ గా వచ్చాడు.

ఇక ఆ స‌మ‌యంలో బాలయ్య, రవితేజ మధ్య జరిగిన గొడవల గురించి కూడా సంభాషణలు వచ్చాయి. అప్పుడు బాలకృష్ణ స్వయంగా రవితేజను మన మధ్య గొడవలు జరిగాయా నేను నిన్ను కొట్టానా అంటూ రవితేజను అడిగాడు. అలా వార్తలు కూడా వస్తున్నాయి కానీ మన ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు కూడా రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు ర‌వితేజ‌. ఇతర హీరోల‌ అభిమానులు వీరిద్దరి మధ్య గొడవలు పెట్టడానికే ఇలా ఫేక్ వార్త‌లు రాశారు అంటూ బాలయ్య, రవితేజ అభిమానులు కామెంట్స్ చేశారు. ఇక దీంతో ఇది ఫేక్ న్యూస్ అంటూ ఇద్ద‌రి అభిమానులు కొట్టి పడేశారు.