మొదట్లో సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ అందుకున్న నటి సురేఖా వాణి (Surekha Vani). టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు కొన్నాళ్లు సూపర్ ఫాం కొనసాగించింది. అయితే భర్త మరణం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది సురేఖా వాణి. సినిమాలు మాత్రమే చేయట్లేదు కానీ సోషల్ మీడియాలో సురేఖా వాణి తన కూతురుతో చేసే హంగామా అంతా ఇంతా కాదు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆమె ఇదివరకు ఆయన మీద చేసిన కామెంట్స్ ని గుర్తు చేసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణం అని.. ఆయన కనబడితే 100 ముద్దులిస్తా అని సురేఖా వాణి కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్స్ ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజెన్లు. పవర్ స్టార్ అంటే సురేఖా వాణికి ఎంత ఇష్టమో అంటూ ఆమె చేసిన కామెంట్ ని పెడుతున్నారు.
Surekha Vani తన కూతురు సుప్రీతని హీరోయిన్ గా చేయాలని చూస్తుంది. అందుకే ఆమెకి సినీ కల్చర్ ని అలవాటు చేస్తుంది. ఇద్దరు కలిసి చేసే గ్లామర్ షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. సుప్రీత కూడా ఇప్పటికే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తుందని తెలుస్తుంది.