NTR : ఎన్.టి.ఆర్ సారీ చెప్పినా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారా.. ఎందుకంటే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా బ్రహ్మాస్త్ర ఈవెంట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఈ ఈవంట్ ని భారీ రేంజ్ లో ప్లాన్ చేయగా చివరి నిమిషంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే రాజమౌళి కామెంట్స్ ప్రకారం ఐదు రోజుల నుంచి పోలీసులను ఫాలో అప్ చేస్తున్నామని కానీ గణపతి ఉత్సవాల కారణంగా పోలీస్ ప్రొటెక్షన్ అటు వెళ్లాల్సి వచ్చిందని అందుకే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని అన్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో బ్రహ్మాస్త్ర ఈవెంట్ కి తారక్ (NTR ) వస్తున్నాడని తెలిసి నందమూరి ఫ్యాన్స్ అంతా అక్కడ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందుకే ఫ్యాన్స్ ని నిరాశపెట్టినందుకు సారీ చెప్పాడు ఎన్.టి.ఆర్. అంతేకాదు మీడియాకి తారక్ సారీ చెప్పాడు. అయితే ఎన్.టి.ఆర్ సారీ చెప్పగా ఫ్యాన్స్ ఓకే అనుకున్నా ఈవెంట్ జరగకుండా అడ్డు పడిన టి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

రీసెంట్ గా ఎన్.టి.ఆర్ అమిత్ షాని కలవడం ఇష్టం లేకనే కావాలని NTR వస్తున్న ఈ ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో ఏమాత్రం నిజం ఉందో తెలియదు కానీ ఎన్.టి.ఆర్ సారీ చెప్పగా శాంతించిన ఫ్యాన్స్ తెలంగాణా ప్రభుత్వం మీద మాత్రం గుర్రుగా ఉన్నారు.

Tags: Brahmastra Event, Nandamuri Fans, ntr, NTR Fans, rajamouli, Ramoji Filmcity, RFC, Tollywood