Brahmastra : తెలుగు ఆడియన్స్ ని కాకాపెట్టే ప్రయత్నంలో రణ్ బీర్, అలియా.. అదరగొట్టేశారు పో..

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇద్దరు తెలుగు ఆడియెన్స్ ని తమ బుట్టలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇద్దరు కలిసి నటించిన Brahmastra సినిమా తెలుగులో రాజమౌళి సమర్పణలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యేందుకు రణ్ బీ కపూర్, అలియా భట్ లు ఇద్దరు తెగ కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది.

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అలియా భట్ తెలుగు పాటని పాడి ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయగా రాజమౌళి రాసిచ్చిన తెలుగు మాటలని ముద్దు ముద్దుగా మాట్లాడి ఇంప్రెస్ చేఏశాడు రణ్ బీర్ కపూర్. ఓ విధంగా ఇద్దరు తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. మాకు హిందీ మార్కెట్ వరకు సరిపోతుందిలే అనుకుంటే వారు తెలుగు రిలీజ్ కి వచ్చే వారు కాదు.

కానీ బ్రహ్మాస్త్రని మరో బాహుబలి చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. Brahmastra ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రణ్ బీర్, అలియాల జోడీ కూడా ఆడియెన్స్ ని అలరించింది. ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చిన ఈ ఈవెంట్ లో సినిమాలో నందీశ్వరుడిగా నటించిన కింగ్ నాగర్జున కూడా అటెండ్ అయ్యారు.

Tags: Alia Bhatt, Brahmastra, nagarjuna, ntr, rajamouli, Ranbhir Kapoor, Tollywood