పుష్ప 2 టీజ‌ర్‌… సుక్కు కాపీ కొట్టేసి అడ్డంగా దొరికేశాడుగా… (వీడియో)

పాన్ ఇండియా స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ పుష్ప 2. పుష్ప లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న ఈ సినిమా ప్రి టీజ‌ర్ నిన్న రిలీజ్ చేశారు. ఇక ఈ రోజు ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక వేర్ ఈజ్ పుష్ప పేరుతో నిన్న‌టి టీజ‌ర్‌కు కొన‌సాగింపుగా రిలీజ్ అయిన టీజ‌ర్ ఏకంగా 3.17 నిమిషాల పాటు ఉంది.

అయితే ఈ వీడియో విజువ‌ల్స్ అదిరిపోయాయి. క‌థ లైన్ మాత్రం రొటీన్‌గా ఉన్నా దానికి సుకుమార్ ట్రీట్‌మెంట్ కొత్త‌గా ఉన్న‌ట్టే అనిపిస్తోంది. పుష్ప ఎక్క‌డ ఉన్నాడో తెలియ‌క‌పోవ‌డం.. పుష్ప‌ను జైలు నుంచి రిలీజ్ చేయాల‌ని ప్ర‌జ‌ల డిమాండ్లు.. పుష్ప దోచుకున్న డ‌బ్బుల‌తో పేద‌ల‌కు సాయం చేయ‌డం.. ఆ పేద‌లంతా పుష్ప త‌మ పిల్లాడిని చ‌దివించాడ‌ని.. త‌మ పిల్లాడికి గుండె ఆప‌రేష‌న్ చేయించాడ‌ని చెప్ప‌డం.. జ‌నాలు అంద‌రూ పుష్ప రావాల‌ని నినాదాలు చేయ‌డం ఇవ‌న్నీ టీజ‌ర్‌లో చూపించారు.

Pushpa 2" fans will have to wait a very long time because shooting was stopped for three months. - Bollywood Mascot

మ‌రో వైపు పుష్ప కోసం అటు పోలీసులు, ఇటు మీడియా వాళ్లు చేసే హ‌డావిడితో టీజ‌ర్ ఉంది. చివ‌ర్లో అడ‌విలో పులి ముందు పుష్ప ఎంట్రీ ఇచ్చే సీన్ మీడియాలో రావ‌డంతో టీజ‌ర్ పూర్త‌య్యింది. చ‌నిపోయాడ‌నుకున్న పుష్ప అడ‌విలో పులి కోసం అమ‌ర్చిన సీసీ టీవీ ఫుటేజ్‌లో క‌న‌ప‌డ‌డంతో జ‌నాలు అంద‌రూ పుష్ప బ‌తికే ఉన్నాడంటూ సంబ‌రాలు చేసుకోవ‌డం ఈ క‌థ లైన్ అయితే కొత్త‌గా లేదు.. అయితే అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు.. ఆ మ్యాన‌రిజం మాత్రం కొత్త‌గా ఉంది.

Pushpa 2 shooting stopped, release for 2023 cancelled. Know why

సుకుమార్ ఈ లైన్ అయితే గ‌తంలో వ‌చ్చిన కొన్ని సినిమాల్లో సీన్ల‌ను కాపీ కొట్టేసి అడ్డంగా దొరికిపోయాడ‌న్న‌ది మాత్రం నిజం. ఇక ఇది పుష్ప గాడి రూలు అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ తో వీడియో ముగుస్తుంది. సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ లో రష్మిక మందన్న హీరోయిన్… దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags: allu arjun, film news, filmy updates, intresting news, latest news, latest viral news, pushpa 2 movie, rashmika mandana, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news