వామ్మో.. ఇంత వైలెన్సా.. వైల్డ్ గా మారిపోయిన లారెన్స్.. ఒక్కొక్కడికి పగిలి పోవాల్సిందే(వీడియో)..!!

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న యాక్షన్ త్రిల్లర్ మూవీ రుద్రుడు. ఈ సినిమాకు స్వీయ డైరెక్షన్ లో కొరియోగ్రాఫర్ కూడా తానే అయి రుద్రుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు రాఘవ లారెన్స్. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కత్తిరేసన్ ఓన్ బ్యానర్ పైన తెరకెక్కించారు.

అయితే కాంచన 3 తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ తో రాఘవ లారెన్స్ మళ్ళీ రుద్రుడు సినిమాతో తెరపైకి రానున్నారు. అయితే ఈ సినిమాను గత సంవత్సరం డిసెంబర్ 23న విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలు చేత సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో ఈనెల ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా లో యువనటి ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

జీవి ప్రకాష్ సంగీతం తో ఆడి రాజశేఖర్ డిఓపిగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్, పోస్టర్స్ సినిమా పైన అంచ‌నాలు పెంచుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ లారెన్స్ ఫైటింగ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైలర్ లో చాలా భాగం లారెన్స్ ఫైట్ తో వైలెంట్ గా కనిపించాడు. తర్వాత హీరోయిన్ ఎంట్రీ చూపించాడు. హీరోయిన్ తో లారెన్స్ పెళ్లి సీన్తో వీడియో ఎండ్ అయింది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, ragava larencee, rudrudiu trailer, rudrudu, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news