మీసం ఉన్న హీరోలే ఇష్టం అంటోన్న శ్రీలీల‌… వామ్మో ఇంత ప్లాన్ ఉందా..!

అతి తక్కువ కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ధమాకా సినిమా రిలీజ్ అయిన తర్వాత రవితేజ కన్నా అందరూ శ్రీ లీల పేరే హాట్ టాపిక్ గా మారింది. దీనికి ముఖ్య కారణం సినిమాల్లో కష్టమైన స్టెప్పులని కూడా అవలీలగా వేసేస్తుంది అంటూ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సైతం ఆమెను పొగిడారు. ఈ క్రమంలోనే శ్రీ లీలకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది.

ఇదే క్రమంలో శ్రీలీల ప్ర‌స్తుతం టాలీవుడ్లో 10 సినిమాల‌కు పైన న‌టిస్తుంది. అందులో ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలే అవ‌టం మ‌రో విశేషం. ఇప్పటికే శ్రీలీల బాలకృష్ణతో భగవంత్ కేస‌రి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కూడా ఈ సంవత్సరం దసరాకి ప్రేక్షకులు ముందుకు రానుంది. అలాగే పవన్ తో ఓజి సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ కూడా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు.

ఇలా శ్రీలీల‌ వరుసగా టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల సినిమాలలోనే ఎక్కువగా నటిస్తుంది.ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో శ్రీ లీల యంగ్ హీరోస్ తో కన్నా సీనియర్ హీరోల‌తోనే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందట. ఎందుకంటే ఆ హీరోలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఎలాంటి సినిమా తీసిన హిట్ కొట్టించడానికి ఫ్యాన్స్ ఉంటారు. తద్వారా శ్రీ లీల ఖాతాలో హిట్లు పడతాయి. ఇదే మెయిన్ రీజ‌న్. ఇక రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ పేరు ఎలా మారు మ్రోగిపోతుందో చూడాలి.