‘ య‌వ‌గ‌ళం ‘ .. న‌డుస్తోంది లోకేష్‌.. న‌డిపిస్తోంది ఎవ‌రో తెలుసా…!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభ‌మై.. అత్యంత విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. అనేక ఇబ్బందులు.. పోలీసు ల నిర్బంధాలు.. స‌ర్కారీ ఆంక్ష‌లు.. ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను కూడా అత్యంత విజ‌య‌వంతంగా దాటుకు ని.. అడుగు అడుగు.. ఆసేతు హిమాచ‌ల‌మై.. ముందుకు సాగుతోంది. అనేక మందిని ప‌ల‌క‌రిస్తూ.. ముందుకు పోతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీని విజ‌య తీరాలకు చేర్చ‌డంతోపాటు , పార్టీ అధినేత చంద్ర‌బాబును మ‌రోసారి ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ హ‌వాను మ‌రింత పెంచ‌డం ల‌క్ష్యంగా యువ‌గ‌ళం పాద‌యాత్ర ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న కుప్పం వేదిక‌గా పురుడు పోసుకుంది. ఇప్ప‌టి వ‌రకు 170 రోజులుగా.. సాగుతున్న యాత్ర 2200 కిలో మీట‌ర్ల‌కు చేరుకుంది. నిజానికి ఈ యాత్రం ఇంత పెద్ద ఎత్తున సాగ‌డం.. అంత తేలికేమీ కాదు.

న‌డుస్తున్న‌ది నారా లోకేష్ అయినా.. న‌డిపిస్తున్నది మాత్రం వేరే వారు ఉన్నారు. పార్టీ కోసం.. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం కోసం.. నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్న సీబీఎన్ ఆర్మీ .. యువ‌గ‌ళం కోసం అనేక రూపాల్లో సేవ‌లు అందిస్తున్న‌దంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. పాద‌యాత్ర సాగే.. ప్ర‌తి ప్రాంతం రూట్ మ్యాప్‌ను తీసుకుని.. ఆ ప్రాంతంలోని నాయ‌కుల‌కు స‌మాచారం ఇవ్వ‌డం నుంచి నారా లోకేష్ ఆహారం, తాగునీరు వ‌ర‌కు అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇక‌, ఈ యాత్ర‌లో మొత్తం 38 వాహ‌నాల‌ను వినియోగిస్తున్నారు. అయితే.. ఇవి ప్రాంతాల వారీగా పెరుగు ద‌ల‌.. త‌గ్గుద‌ల కూడా న‌మోదు చేసుకుంటోంది. ఈ పాద‌యాత్ర‌లో ఆది నుంచి ఉన్న సీబీఎన్ ఆర్మీ.. ఉద యం నుంచి ఏర్పాట్లు చేస్తుంది. సెల్ఫీ ప్రోగ్రాం నుంచి స్థానిక స‌భ వ‌ర‌కు కూడా.. వీరే ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు.. స‌భ‌ల‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలిగేలా కూడా.. వారికి దిశానిర్దేశం చేస్తారు. స్థానికంగా ఉన్న నాయ‌కుల‌ను క‌లుపుకొని పోతూ.. యాత్ర‌ను విజ‌య‌వంతం చేసేలా కృషి చేస్తున్నారు.

ఇక‌, ఐటీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను డిజిట‌ల్ రూపంలో ప్ర‌చారం క‌ల్పించ‌డంతోపా టు.. యువ త అభిప్రాయాలు సేక‌రించ‌డం.. వాటికి అనుగుణంగా నారా లోకేష్ యాత్ర‌లో ప్ర‌స్తావించాల్సి న అంశాల‌పై నోట్ త‌యారు చేయ‌డం.. ఇలా అనేక రూపాల్లో ఎంతో మంది కార్య‌క‌ర్త‌లు నిర్విరామంగా ప‌నిచేస్తుండ‌డం గ‌మ‌నార్హం. సుమారు 1000 మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు.. ప‌నిచేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సో.. యువ‌గ‌ళంలో న‌డుస్తున్న‌ది నారా లోకేష్.. న‌డిపిస్తున్న‌ది కార్య‌క‌ర్త‌లే అన‌డంలో సందేహం లేదు.