మెగాస్టార్‌కు రు. 50 ల‌క్ష‌ల‌తో బ్యాండ్ వేసిన శ్రియ… ఒక్క‌సారిగా మైండ్ దొబ్బిందా..!

మెగాస్టార్ చిరంజీవి కి సీనియర్ నటి అమ్మ అయినా శ్రీయ పెద్ద షాక్ ఇచ్చిందట ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో షాకింగ్ న్యూస్ గా మారింది చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరుకు చెల్లి పాత్రలో కనిపిస్తున్నారు. తమిళంలో అప్పుడెప్పుడో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే హాట్‌ యాంకర్ శ్రీముఖి కూడా అదిరిపోయే పాత్రలో కనిపిస్తోంది.

Chiranjeevi Pair Up With Shriya | Kollywood Updated

అలాగే సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ ఐటెం సాంగ్ కోసం శ్రీయ‌ను సెలెక్ట్ చేశారన్న విషయాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే శ్రీయ పెట్టిన ఓ మెలిక‌తో భోళాశంక‌ర్‌ యూనిట్ ఇప్పుడు విలవిలాడుతుంది అట. ఈ స్పెషల్ సాంగ్ చిరంజీవి సరసన స్టెప్పులు వేసేందుకు శ్రీయ ఏకంగా రు. 75 లక్షలు డిమాండ్ చేసిందట.

Amazon.com: Tagore : Chiranjeevi, Jyothika, Shriya Saran, Prakash Raj, A.  R. Murugadoss, V. V. Vinayak, B. Madhu: Prime Video

నిజానికి రు. 20-25 లక్షలు ఇచ్చి శ్రియను ఈ ఐటెం సాంగ్‌కు సెట్ చేయాలనుకుందట. అంటే శ్రియ వీళ్లు ఇవ్వాల‌నుకున్న రెమ్యున‌రేష‌న్ కంటే మ‌రో రు. 50 ల‌క్ష‌ల‌తో బ్యాండ్ వేసిన‌ట్టే అనుకోవాలి. ఇప్ప‌టికే భోళాశంక‌ర్‌కు చాలా ఎక్కువ ఖ‌ర్చు పెట్టించేస్తున్నాడు మెహ‌ర్ ర‌మేష్‌. ఇప్పుడు ఓ ఐటెం సాంగ్‌కు శ్రియ‌కే రు. 75 ల‌క్ష‌లు ఇస్తే.. ఆ సాంగ్ షూటింగ్‌, పిక్చ‌రైజేష‌న్‌కు ఇంకా చాలా ఖ‌ర్చువుతుంది. ఏదేమైనా శ్రియ ఇచ్చిన షాక్‌తో భోళాశంక‌ర్ యూనిట్ విల‌విల్లాడుతోందంటున్నారు.