అక్కినేని ఫ్యామిలీకి ఘోర‌మైన శాపం… ‘ ఏజెంట్‌ ‘ తో అఖిల్ రాడ్ దింపేశాడు…!

అక్కినేని ఫ్యామిలీకి నిజంగానే ఏదో శాపం తగిలినట్టుగా ఉంది. ఆ ఫ్యామిలీకి గత కొంతకాలంగా ఏ విషయంలోనూ కాలం కలిసి రావడం లేదు. నాగచైతన్య – సమంత విడాకుల‌ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి వరుస పరాజ‌యాలు ఎదురవుతున్నాయి. చైతు బాలీవుడ్లో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చి అమీర్ ఖాన్ తో కలిసిన నటించిన సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో చేసిన థ్యాంక్యూ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బాల్చి తన్నేసింది.

అటు నాగార్జున – నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా ఒక్కటి మాత్రమే కాస్త ఆకట్టుకుంది. ఇక నాగార్జునకు సోలో హిట్ వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుందో అసలు గుర్తులేదు. గత ఏడాది నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది. అసలు నాగర్జున సినిమాలు అంటే తొలిరోజు ఓపెనింగ్స్ కూడా ఉండటం లేదు. అభిమానులు కూడా నాగార్జునను మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. కనీసం యూత్లో మంచి క్రేజ్ ఉన్న అఖిల్ సినిమా కెరియర్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.

అఖిల్ ఇండస్ట్రీలకు వచ్చి ఎనిమిది ఏళ్లు అవుతున్న ఇప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాడ‌ని.. కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటానని అఖిల్ ఎంతో ధీమాగా ఉన్నాడు. కట్ చేస్తే ఏజెంట్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయా లేదో ఏజెంట్ పరమ చెత్తగా ఉందని అక్కినేని అభిమానులే బాధపడుతూ చెబుతున్నారు.

గత కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీకి ఏదో శాపం తగిలిందని.. అందుకే అటు తండ్రి నాగార్జునతో పాటు ఇటు కుమారులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరికీ సినిమాకేరీర్‌తో పాటు, పర్సనల్ కేరీర్ ఏమాత్రం కలిసి రావడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా నాగార్జున తన కుమారులను సినిమారంగంలో హీరోలుగా సెటిల్ చేయాలనుకుంటే వ్యాపారాలు, ఇతర వ్యాప‌కాలపై కాస్త దృష్టి తగ్గించి వీళ్లిద్దరి కెరీర్ మీద ఫోకస్ పెడితే మంచి హిట్ సినిమాలు పడడంతో పాటు వీళ్ళ కెరీర్ కు మంచి పునాదులు పడతాయని చాలామంది సూచనలు చేస్తున్నారు.

అటు నాగార్జున కూడా ఇష్టం వచ్చినట్టు కథలు ఎంచుకొని సినిమాలు చేయటం కంటే.. కథాబలం ఉన్న సినిమాలు చేస్తే ఈ వయసులో పరువు నిలుపుకున్నట్టు ఉంటుందని కూడా సూచనలు చేస్తున్నారు. మరి అక్కినేని హీరోలు ఏం చేస్తారో ? చూడాల్సి ఉంది.