శ్రీదేవి పెద్ద తోపేం కాదు… స్టార్ హీరోయిన్ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌…!

మహానటి సావిత్రి తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరంటే మనకు గుర్తొచ్చేది అతిలోకసుందరి శ్రీదేవి. ఆమె మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏయ‌న్ఆర్ తో మొదలుపెట్టి ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోస్ అందరితోనూ తెలుగు సినిమాల్లో నటించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ స్టార్ ఐకాన్ గా శ్రీదేవి ఎదిగినా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి పునాది వేసిన‌ తెలుగు ఇండస్ట్రీపై శ్రీదేవికి ప్రత్యేక గౌరవం ఉండేది.

Sridevi Radhika: శ్రీదేవి కన్నా నాకేం తక్కువ అంటూ పెద్ద గొడవ చేసిన రాధిక-Sridevi Radhika: శ్రీదేవి కన్నా నాకేం తక్కువ అంటూ పెద్ద గొడవ చేసిన రాధిక - Telugu ...

కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీదేవి ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకుల మదిలో అలానే నిలిచిపోయింది. ఆమె ఎంతో డిస్‌ప్లైన్‌గా ఉండే వారిని.. గొడవలకు చాలా దూరంగా ఉండే వారిని ఎంతోమంది ఆమెతో నటించిన నటులు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే హీరోయిన్ రాధికతో శ్రీదేవి కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. శ్రీదేవికి ఇండస్ట్రీలో పెద్దగా వివాదాలు ఉండేవి కాదు. అలాంటిది శ్రీదేవిపై రాధిక అప్ప‌ట్లో చేసిన‌ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం విశేషం.

రాధిక, శ్రీదేవి కలిసి ఒక సినిమాలో నటించేటప్పుడు వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగాయ‌ని.. శ్రీదేవి పెద్ద తోపేం కాదు అంటు రాధిక గొడవ ప‌డిందంటు అప్పట్లో వార్తలు వ‌చ్చాయి. అయితే శ్రీదేవి, రాధిక ఇద్దరు ఎప్పుడు ఎదురెదురుగా ఒక మాట కూడా అనుకోలేదట. అలాగే కలిసిమెలిసి షాపింగ్ కూడా చేసేవారట.అసలు విషయానికి వస్తే ఒక తమిళ సినిమాలో రాధిక, శ్రీదేవి కలిసి నటించారు. అప్ప‌టికే స్టార్ హీరోయిన్‌గా శ్రీదేవితో సమానంగా రెమ్యూన‌రేష‌న్ ఇవ్వాలంటూ ప్రొడ్యూసర్ ని రాధిక డిమాండ్ చేసిందట.

Radhika Sarathkumar gets emotional by recollecting her memories with Sridevi at South Movie Awards - YouTube

ఇదే వారిద్దరి మధ్య కారణమైందని దాంతో గొడవ పెద్దదవుతుందని భావించిన ప్రొడ్యూసర్ శ్రీదేవిని పిలిపించి కాస్త పారితోషికాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని అడిగాడట‌ అయితే అప్పటికే తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా శ్రీదేవి గుర్తింపు తెచ్చుకోవడంతో దానికి ఒప్పుకోలేదట. ఇలాగే ఉంటే ఇక ఈ గొడవ పెద్దదవుతుందని భావించిన నిర్మాత రాధికను తీసేసి సరితని పెట్టి ఆ సినిమాను పూర్తి చేశాడట.