ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఆస్తులు అన్ని కోట్లా… ఆ పొలిటిక‌ల్ స్టార్ హ్యాండ్ ప‌డ‌గానే సెటిలైపోయిందా..!

తెలుగులో చాలామంది టాప్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు. వాళ్ళలో పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ఢిల్లీలో పుట్టిన ర‌కుల్‌ గిల్లి అనే కన్నడ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఎన్టీఆర్ – మహేష్ బాబు – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – నాగార్జున – నాగచైతన్య – సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలతో వరస పెట్టి నటించింది.

ఇక‌ రామ్ చరణ్ అయితే వరుసగా రకుల్‌ను తన సినిమాలలో రిపీట్ చేశాడు. తమిళంలోనూ స్టార్ హీరోలతో నటించింది. దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీని వరుసగా స్టార్ హీరోల పక్కన నటిస్తూ ఏలేసింది అని చెప్పాలి. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గట్టిగానే ఆస్తులు కూడా పెట్టిందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.

హైదరాబాద్ తో పాటు ముంబై , వైజాగ్, చెన్నై, బెంగళూరులో రకుల్ ప్రీత్ సింగ్ భారీగా ఆస్తులు కూడా పెట్టింది. హైదరాబాద్‌లో 16 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక సొంత ప్లాట్ ఉంది. దీని విలువ ఎనిమిది కోట్లకు పైనే ఉంటుంది. రకుల్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు తన సొంత ఇంట్లోనే ఉంటుంది. అలాగే ముంబై లోను, బెంగళూరులో కూడా ఆమెకు సొంతంగా ప్లాట్లు ఉన్నాయి.

హీరోయిన్గా సత్తా చాటుతూ అటు వ్యాపారంలోకి కూడా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే వైజాగ్ తో పాటు హైదరాబాదులో జిమ్ ప్రాంచైజీ సెంటర్లను ఓపెన్ చేసింది. ఆమె వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వెనక ఓ రాజకీయ నేత అండదండలు ఉన్నాయని.. ఆ నేత హ్యాండ్ ఆమెపై పడడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయిపోయిందన్న పుకార్లు కూడా ఉన్నాయి.

ఇక రియ‌ల్ ఎస్టేట్‌లోనూ ఆమె పెట్టుబ‌డులు ఉన్నాయంటున్నారు. మొత్తంగా రకుల్ ఆస్తులు విలువ 70 కోట్లకు పైనే ఉంటుంది అట. ఆమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నానీతో ప్రేమాయణం నడిపిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.