ఎన్టీఆర్ సినిమాకు ప‌క్కా కాపీగా శాకుంత‌లం… బ‌య‌ట ప‌డిన ప‌చ్చి నిజాలు..!

శకుంతల అనగానే ప్రస్తుతం గుణశేఖర్ తీసిన సినిమాయే అంద‌రిమ‌దిలో మెదులుతోంది. ఎన్నో అంచ‌నాల‌తో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో దిల్ రాజు బ్యాక‌ప్‌తో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే ఈ సినిమా ప‌క్కా కాపీ అన్న‌ది ఇప్పుడు పూర్తిగా బ‌య‌ట ప‌డింది. ఎప్పుడో 1966లోనే కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో బి సరోజాదేవి శకుంతలగా, ఎన్.టి. ఆర్ దుశ్యంతుడిగా
శకుంతల టైటిల్‌తో ఓ సినిమా వ‌చ్చింది.

Shaakuntalam Movie Review & Rating - Filmy Focus

ఈ శకుంతల కథకి మూలం మహాభారతమే అయినా కాళిదాసు పుణ్యమా అని ఈ క‌థ చాలా మార్పులు, చేర్పుల‌తో గొప్ప ఫిక్షన్ గా మారింది. ఆ త‌ర్వాత ఇదే మ‌హాభార‌తంలోని ఒక ఘ‌ట్టాన్ని ఆధారంగా చేసుకుని శశిరేఖా పరిణయం అనే జానపద నాటకంతో పాటు సినిమాలు కూడా వ‌చ్చాయి. ఇక గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమాను స‌మంత‌లం అన‌డం బెట‌ర్ అన్న సెటైర్లు బాగా పేలుతున్నాయి.

కేవ‌లం స‌మంత టైటిల్ రోల్ పోషించ‌డం వ‌ల్లే ఈ సినిమాకు కాస్తో కూస్తో హైప్ వ‌చ్చింది. అస‌లు లేక‌పోతే ఈ సినిమాను గుణ‌శేఖ‌ర్ పేరు చూసి చూడాల‌న్న ఆతృత ఎవ్వ‌రికి లేదు. గుణ‌శేఖ‌ర్ చేసింది ఏంటంటే ఎన్టీఆర్ – క‌మ‌లాక‌ర రామేశ్వ‌ర‌రావు శాకుంత‌లం సినిమాలో కొన్ని సీన్ల‌ను యాధావిధిగా వాడేసుకున్నాడు. కొన్ని సీన్లు కొత్త‌గా రాసుకున్నాడు.

విచిత్రం ఏంటంటే ఇక్క‌డ కాపీ కొట్టిన భాగం, ఆ సీన్లు బాగున్నాయి. గుణ‌శేఖ‌ర్ సొంతంగా క్రియేట్ చేసి తీసిన సీన్లు, క‌థ అంతా ఫ‌ల్టీ కొట్టేసింది. అదే చిరాకుగా ఉంది. చివ‌ర‌కు వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్క‌లేదు స‌రిక‌దా.. సినిమా ప్లాప్ అయ్యి ఉన్న ప‌రువు కూడా పోయింది. చివ‌ర‌కు సంభాష‌ణ‌లు కూడా ప‌ర‌మ రొడ్డ కొట్టుడులా ఉన్నాయి.

గుణశేఖర్ స్క్రిప్ట్ విషయంలో పెద్ద క‌ష్ట‌ప‌డ‌కుండా… పాత ఎన్టీఆర్‌ సినిమాని ముందు పెట్టుకుని నచ్చిన ముక్కలు లేపేసి ఇక్క‌డ పేస్ట్ చేసిన‌ట్టుగా ఉంది. అందుకే ప్రేక్ష‌కులు అంత ఘోరంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Samantha, social media, social media post, sr.ntr, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news