రివ్యూ: సామజవరగమన .. శ్రీ విష్ణుకు యునాన‌మ‌స్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌

కామెడీ క‌థ‌ల‌కు పెట్టింది పేరు అయిన‌ శ్రీ విష్ణు దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి చేసిన‌ సినిమా సామజ వర గమన. గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమాకు ఇప్ప‌టికే చాలా చోట్ల ప్రీమియ‌ర్లు కూడా ప‌డ్డాయి. ఈ సినిమా క‌థ‌లోకి వెళితే ఏషియన్ మల్టీప్లెక్స్ ఉద్యోగి బాలు ( శ్రీ విష్ణు ) చాలా పిసినారి. తండ్రి ఉమామహేశ్వర రావు ( సీనియ‌ర్‌ నరేష్ ) ను డిగ్రీ పాస్ చేయించాల‌ని పెద్ద కంక‌ణ‌మే క‌ట్టుకుంటాడు. న‌రేష్ డిగ్రీ పాస్ అయితేనే వీళ్ల‌కు కోట్లాది రూపాయ‌ల ఆస్తి వ‌చ్చేలా ట్విస్ట్ ఉంటుంది.

ఇక త‌న‌కు ఐల‌వ్ యు చెప్పిన ప్ర‌తి అమ్మాయికి మ‌నోడు రాఖీ క‌ట్టేస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే త‌నకు ప‌రిచ‌యం అయ్యి త‌న ఇంట్లోనే పేయింట్ గెస్ట్‌గా దిగిన సరయు ( రెబా మౌనికా జాన్ ) తో ప్రేమ‌లో ప‌డి ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటాడు. అయితే వీరికి షాక్ ఇస్తూ బాలు బావ‌కు స‌ర‌యు అక్క‌కు పెళ్లి కుదురుతుంది. చివ‌ర‌కు వీరిద్ద‌రి ప్రేమ ఏమైంది ? బాలు తండ్రి డిగ్రీ పాసై ఆస్తిని దక్కించుకున్నాడా ? లేదా అన్నదే ఈ సినిమా.

విశ్లేష‌ణ :
ఈ సినిమా నాన్‌స్టాప్ ఎంట‌ర్టైన‌ర్‌. రివ‌ర్స్‌లో కొడుకే తండ్రిని చ‌దువుకోట్లేద‌ని తిట్ట‌డం.. హీరోయిన్ కుటుంబం హీరోకు రాఖీ క‌ట్ట‌డానికి రావ‌డం.. హీరో త‌ప్పించుకోవ‌డం.. హీరోయిన్‌.. హీరో ఇంట్లోకి పేయింగ్ గెస్ట్‌గా వ‌చ్చి ప్రేమ‌లో ప‌డ‌డం.. వీరి ప్రేమ‌కు ఎదురైన అడ్డంకులు ఇవ‌న్నీ చాలా కామెడీ పండిస్తాయి.
సినిమా ఆద్యంతం ఫన్ రాబ‌ట్టినా.. సెకండాఫ్ లో వచ్చే కొన్నిసీన్లు స్లోగా ఉంటాయి. టెక్నిక‌ల్‌గా అంతా బాగుంది.

బాలు పాత్ర‌లో శ్రీవిష్ణు చాలా బాగా చేశాడు. హీరోయిన్ మెనికా కూడా స‌ర‌యు పాత్ర‌లో ఒదిగిపోయింది. ఆమె కూడా కామెడీ బాగా పండించింది. ద‌ర్శ‌కుడు అన్ని పాత్ర‌లు బాగా రాసుకుని… బాగా కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యేలా చేశాడు. ఓవ‌రాల్‌గా శ్రీవిష్ణుకు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అదిరిపోయే హిట్ ఇచ్చిన‌ట్టే.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న రేటింగ్ : 3.25/5