పెద్దమామ చిరంజీవి లక్కీ హీరోయిన్‌తో సాయిధ‌ర‌మ్ తేజ్ చిందులు.. ( వీడియో )

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గతంలో రాధ- మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అప్పట్లో టాలీవుడ్ లో రాధ స్టార్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రాధ‌ మెగాస్టార్ తో పోటీ పడి మరి సినిమాల్లో స్టెప్పులు వేసేవారు. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కి ఎంత క్రేజీ ఉండేదో తెలిసిందే. తర్వాత కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే రాధ పెళ్లి చేసుకుని సినిమాలుకు దూరమయ్యారు.

ఇక మళ్ళీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం రాధ స్టార్ మా లో వచ్చే నీతోనే డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షో కి యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా గెస్ట్ గా వచ్చాడు. సాయిధరమ్ తేజ్- పవన్ కళ్యాణ్ కాంబోలో తెర‌కెక్కిన బ్రో సినిమా కూడా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సందర్భంగానే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ రియాలిటీ షోలో సాయిధరమ్ తేజ్ సందడి చేశాడు.

ఇక సాయి ధరమ్ తేజ్ షోలో ఎంట్రీ ఇవ్వగానే ఇంకా ఎన్ని రోజులు షో లోగా ఉంటారు అని శ్రీముఖి ప్రశ్నించగా.. జీవితాంతం అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు. వెంటనే తనకు సపోర్ట్‌గా నటి సదా బ్రో అంటూ పిలిచింది. దీనికి సాయి తేజ్ మీరు బ్రో అంటే మేము వెళ్లవయ్యా వెళ్లు అంటాం అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ సీనియర్ హీరోయిన్ రాధ‌తో కలిసి స్టెప్పులు కూడా వేశాడు. రాధ చిరుకు ఎంత ల‌క్కీ హీరోయిన్నో తెలిసిందే.

యముడికి మొగుడు సినిమాలోని అందం హిందోళం పాట‌కి రాధ- సాయి తేజ్‌ తో ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్గా స్టెప్పులు వేసింది. ఇక త‌ర్వాత సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ఇలా నేను పెద్ద మామ‌ చిరంజీవితో డ్యాన్స్ చెయ్యలేకపోయాను.. కానీ మీతో కలిసి డ్యాన్స్ చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పుకొచ్చాడు.. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.