మ‌హేష్ కూతురు సితార బ‌న్నీకి ఇంత పెద్ద ఫ్యానా… బ‌న్నీ కోసం ఏం చేసిందంటే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని ఇప్పుడు తెలుగు మీడియా.. తెలుగు సోషల్ మీడియాలో ఓ క్రేజీ పర్సన్ అయిపోయింది. సితార ఏం చేసినా ? ఓ సంచలనం అవుతుంది. ఇంత చిన్న వయసులోనే సితారకు మామూలు క్రేజ్ రాలేదని చెప్పాలి. ఇప్పటికే కొన్ని వీడియోలు చేస్తున్న సితార తాజాగా ఒక వాణిజ్య ప్రకటనలో కూడా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ వాణిజ్య ప్రకటనలో సితార ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నిజం చెప్పాలంటే ఎంతో అనుభవం ఉన్నాం సీనియర్ నటీమణులు ఇచ్చేంత గొప్పగా ఉన్నాయి.

ఈ జ్యూవెలరీ యాడ్లో నటించినందుకు గాను సితారకు ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ రాగా అదంతా ఛారిటీకి ఇచ్చేసానని ప్రకటించింది. రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఫౌండేషన్ లోని అమ్మాయిలకు సైకిల్స్‌ అందజేసి గొప్ప మనసు చాటుకుంది. ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ రోజు రోజుకు తన క్రేజ్‌ మరింత పెంచుకుంటుంది.

ఇక సితారకు తన తండ్రి మహేష్ బాబు తో పాటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం అట. తాజాగా ఫ్లైట్లో తన తండ్రి మహేష్ పక్కన కూర్చుని పుష్ప సినిమాలో బన్నీ మేనరిజం డైలాగ్ అయినా తగ్గేదెలా డైలాగ్ ఫోజు పెట్టింది. ఈ ఫోటో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. సితార కూడా ఈ మేనరిజం వాడుతూ దిగిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్ ఇంట్లో పిచ్చపిచ్చగా వైరల్ అవుతుంది. దీంతో నెటిజ‌న్లు అందరూ సితార అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.