రావ‌ణాసుర‌లో మ‌హిళ‌ల‌ను ఘోరంగా అవ‌మాన‌ప‌రిచిన ర‌వితేజ (వీడియో)

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్టర్ చేసిన ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రవితేజకు జోడిగా నటించారు. దక్ష నగార్క‌ర్ – మేఘా ఆకాష్ – పూజిత పొన్నాడ – అను ఇమ్మానుయేల్ – ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే గత కొద్ది గంటల నుంచి రావణాసుర సినిమాలో ఓ డైలాగ్ వీడియో లీక్ అయింది. ఇందులో రవితేజ చెప్పిన ఆ డైలాగ్ ఇప్పుడు మహిళల పట్ల తీవ్ర అభ్యంతర కరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ డైలాగులో రవితేజ కంచం ముందుకి …మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగనే రావాలి లేకపోతే నాకు మండుద్ది అంటూ రాక్షసంగా డైలాగ్ చెప్పాడు.

అయితే ఈ డైలాగ్ చాలా అభ్యంతరకరంగా ఉందని నెటిజ‌న్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ఈ డైలాగ్ తీవ్ర అభ్యంతరకరంగా ఉందని.. వెంటనే దీనిని సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రవితేజ అభిమానులు మాత్రం రావణాసుర అంటే ఆ మాత్రం ఉంటుంది.. నెగిటివ్ షేడ్‌కు తగ్గట్టు ఇలాంటి డైలాగులు లేకపోతే ఎలా ? అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Ravanasura, ravanasura movie, RaviTeja, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news