విడాకుల త‌ర్వాత స‌మంత కోసం చీక‌టి గ‌దిలో ఏడ్చేసిన నాగ‌చైత‌న్య‌..!

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య – సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు కావస్తోంది. వీరిద్దరు విడాకులు తీసుకుని ఎన్ని నెలలు అవుతున్నా ఎప్పటికీ వీరి విడాకులు.. వీరి వ్యక్తిగత జీవితం గురించి రకరకాల వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. సమంత సినిమాలు, సమంత వ్యక్తిగత జీవితం అటు నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎఫైర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు నాగచైతన్య, సమంత లేనిదే తెలుగు సోషల్ మీడియాకు నిద్ర పట్టేలా లేదు.

ఎప్పుడు ఏదో ఒక వార్త వీరిద్దరి గురించి వైరల్ అవుతూనే వస్తోంది. నాలుగు సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత మనస్పర్థ‌ల‌ నేపథ్యంలో ఒకరి విషయంలో ఒకరు సర్దుబాటు కాలేక విడాకులు తీసుకుని ప్రతి ఒక్కరిని బాధపెట్టారు. వీరిద్దరు విడాకుల‌ వెనక అసలేం జరిగింది అన్నది తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ తెలియని ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

గతంలో ఒక షోలో పాల్గొన్న సామ్‌ నాగచైతన్యను.. నన్ను ఒకే రూమ్ లో ఉంచితే పదునైన కత్తులు లాంటిది రూమ్‌లో ఉండకూడదు అంటూ నాగచైతన్య పై తన కోపాన్ని బయటపెట్టింది. విడాకుల విషయంలో చాలామంది సమంతది తప్పు అని ప్రచారం చేశారు. సోషల్ మీడియాలోనూ, మీడియాలో కూడా సమంత వైపే ఎక్కువగా విమర్శలు వెళ్లాయి. నాగచైతన్యది తప్పు అన్నవాళ్ళు చాలా తక్కువ ముందే ఉన్నారు.

Samantha says her life crumbled in 2021 after split from Naga Chaitanya -  India Today

తాజాగా నాగచైతన్య గురించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య చాలా రోజులపాటు గదిలో కూర్చుని ఏడ్చాడట. అంతేకాదు సమంతతో ఉన్న జ్ఞాపకాలను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఎక్కి ఎక్కి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని నాగచైతన్య స్నేహితుల ద్వారా విషయం బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులు స్నేహితులు ఎంత ఓదార్చినా కూడా చైతు ఆ బాధ నుంచి బయటపడలేదట.

చివరికి జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవలసి ఉంటాయన్న నిర్ణయానికి వచ్చి.. మళ్లీ ధైర్యం తెచ్చుకుని చైతు మామూలు మనిషి అయ్యాడట. స‌మంత మాత్రం నాగచైతన్య పై ఎప్పుడు పరోక్షంగా సెటైర్లు వేస్తూ తన కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. చైతు మాత్రం సమంత ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఒక నవ్వు నవ్వి.. చాలా పాజిటివ్గా మాట్లాడుతాడు. ఏరోజు సమంతని నిందించలేదు. ఇక చైతు సమంత విషయంలో అంతగా బాధపడటానికి కారణం ? ఆమెను వదులుకోవటం తనకు ఇష్టం లేకపోయినా.. తన కుటుంబ సభ్యుల బలవంతం వల్లే తప్పక ఆమెకు దూరం కావలసి వచ్చింది అన్నది చైతు బాధ అట.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, NagaChaitanya, Samantha, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news