జీవిత కంటే ముందే రాజ‌శేఖ‌ర్‌కు పెళ్ల‌య్యిందా… !

జీవిత, రాజశేఖర్ దంపతులు టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని వ్యక్తులు. జీవిత, రాజశేఖర్ నిజానికి ఇద్దరు అయినా వీరిద్దరిని ఎప్పుడు ఎవరు వేరువేరుగా చూడలేము. జీవితలేనిదే రాజశేఖర్ లేడు. రాజశేఖర్ లేనిదే జీవిత కూడా లేదు.. అన్నంతగా కలిసి మెలిసి ఉంటారు. ఈ భార్యాభర్తలు 1990వ దశకంలో హీరో, హీరోయిన్లుగా వీరిద్దరూ ఒక వెలుగు వెలిగారు. ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. జీవిత – రాజశేఖర్ కాంబినేషన్ అంటేనే అప్పట్లో ఒక క్రేజీ ఉండేది.

వెండితెర మీద భార్యాభర్తలు, ప్రేమికులుగా కలిసి ఎన్నో సినిమాలలో నటించిన ఈ దంపతులు నిజజీవితంలోనూ భార్యాభర్తలు అయ్యారు. ఈ దంపతుల ఇద్దరు కుమార్తెలు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తాజాగా జీవిత, రాజశేఖర్ దంపతులు తమ ప్రేమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకరోజు రాజశేఖర్ జీవిత దగ్గరికి వెళ్లి మీరు నాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ? అని నేరుగా అడిగేసాడట.

 

అయితే రాజశేఖర్ సిన్సియార్టీ జీవితకు బాగా నచ్చేసింది అట. రాజశేఖర్ ఫ్యామిలీని ఒప్పించేందుకు.. ఆయనను పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టపడ్డానని జీవిత చెప్పింది. అయితే రాఘవేంద్రరావుకు విషయం తెలియడంతో రాజశేఖర్ విలన్ లా ఉన్నాడు.. జాగ్రత్తగా ఉండు అని జీవితకు సలహా కూడా ఇచ్చారట. దీంతో జీవితలో టెన్షన్ మొదలైందట. అయినా రాజశేఖర్ మీద ఉన్న ప్రేమతో పట్టు వదలకుండా అతడి ప్రేమను పొందేందుకు జీవిత ఎన్నో పోరాటాలు చేసిందట.

Non-bailable warrant issued against actors Jeevitha, Rajasekhar

అంతకుముందే రాజశేఖర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం కూడా తీసేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన జీవిత చాలా బాధపడిందట. రాజశేఖర్ ఒకరోజు తన అంబాసిడర్ కారులో తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి పక్కనే కూర్చుని ఉంటే.. అదే సమయంలో జీవిత వెనక సీట్లో కూర్చుని ఉందట. ఆ సమయంలో రాజశేఖర్‌ తనకు దక్కడేమో అని చాలా ఏడ్చానని ఆనాటి సంఘటన గుర్తు చేసుకుంది జీవిత‌.

నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న కూడా నేను నీతోనే ఉంటాను అని రాజశేఖర్ కు తెగేసి చెప్పిందట. చివరకు రాజశేఖర్‌ను పైనుంచి తోసేసి.. ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్పించి సకల సేవలు చేసి రాజశేఖర్ పేరెంట్స్ మెప్పు పొంది.. చివరికి అతడు జీవిత భాగస్వామి అయింది. వీరిద్దరి లవ్ స్టోరీ ఎంతో ఆసక్తిగా అనిపిస్తోంది. ఆ టైంలో రాజ‌శేఖ‌ర్ మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స్ అవ్వ‌డంతో రాజ‌శేఖ‌ర్‌కు పెళ్లి కాకుండానే పెళ్లైంద‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో జ‌రిగింది.

Jeevitha updates health status of Rajasekhar

ఇక అతిలోక అందాల సుందరి శ్రీదేవి కూడా రాజశేఖర్ కు భార్య కావలసిన అమ్మాయి. శ్రీదేవి తల్లి స్వయాన రాజశేఖర్ ను మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని కోరారు .అయితే అప్పుడప్పుడే రాజశేఖర్ కెరీర్‌లో ఎదుగుతున్నారు. దీంతో ఆయ‌న‌ ప్రతిపాదన తిరస్కరించారు. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా చెప్పారు.

Tags: film news, filmy updates, intresting news, jivitha, latest news, latest viral news, Rajashekar, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news