రవితేజ ‘ టైగర్ నాగేశ్వరరావు ‘ … ఇంత పెద్ద గ‌జ‌దొంగ‌కు వేల‌ల్లో అభిమానులున్నారా… షాకింగ్ హిస్ట‌రీ..!

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు ఒకప్పటి గజదొంగ అని మీకు తెలుసా.. స్టువర్ట్ పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెద్దల దగ్గర నుంచి దోచుకుని పేదలకు పంచేవాడు. అప్పట్లోనే అతనికి చాలామంది ఫాన్స్ ఫాలోయింగ్ ఉండేది. అతను నేరస్థుడైనప్పటికీ ఎన్నో మంచి పనులు చేసి పేదల పాలిట రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి నన్ను పట్టుకోలేరంటూ శప‌థం చేసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. అత‌డిని పోలీసులు ప్లాన్ వేసి పట్టుకొని చంపిన‌ తరువాత ఆయన అంతిమయాత్ర చాలామంది అభిమానుల మధ్య మూడు రోజులు సాగిందట.

ప్రస్తుతం రవితేజ హీరోగా ఈ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది. బాపట్ల సమీపంలో స్టువర్ట్ పురం ఉంటుంది. స్వాతంత్య్రానికి పూర్వ‌మే సెటిల్మెంట్ చట్టం ప్రకారం స్టువ‌ర్ట్ పురం అనే గ్రామం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని ఇతర నేరస్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా చేయడానికి అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హారల్స్ స్టువర్ట్ పేరుతో ఈ గ్రామానికి నామకరణం చేసి నివాసం కల్పించారు.

స్టువర్ట్ పురంలో ప్ర‌జ‌ల‌కు దొంగలు అంటే ఒక రకమైన భయం ఉండేది. కానీ టైగర్ నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. దొంగలకు హీరోగా, ప్రజలకు ఆపద్బాంధవుడుగా, పోలీసులకు చెమటలు పట్టించేవాడు.నాగేశ్వరరావు కుటుంబంలో దొంగతనాలు వారసత్వంగా వస్తున్న విద్య. ఈయన 1953 – 56 మధ్యలో జన్మించాడు. సోదరులు ప్రసాద్, ప్రభాకర్. వీరి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కొద్దికాలం తర్వాత తండ్రి కూడా చనిపోయాడు. తర్వాత ప్రభాకర్ కూడా తండ్రి బాటలోనే దొంగతనాలకు పాల్పడేవాడు. ప్రభాకర్ ఆచూకి కోసం ప్రయత్నిస్తూ విఫలమైన పోలీసులు నాగేశ్వరరావ్ ను అత‌ని 15 ఏళ్ల వయసులోనే తీసుకెళ్లి చాలా టార్చర్ చేశారు.

Who Is Tiger Nageswara Rao | Tiger Nageswara Rao Real Story |Stuvartpuram |  Theory Of History Telugu - YouTube

ఏ తప్పు చేయని నాగేశ్వరరావ్ ను అలా హింసించడంతో తను కూడా అన్న బాటే పట్టి నేరస్తులతో జతకట్టాడు. 1970లో తమిళనాడుకు వెళ్లిపోయి అక్కడ వేరే పేరుతో నివాసం ఉంటు దొంగతనాలు మొదలుపెట్టాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి వచ్చాక అతని ముఠాలో జాయిన్ అయ్యాడు. ఒకసారి అన్నదమ్ములు ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు. తిరువల్లూరు జైల్లో ఉన్న నాగేశ్వరరావును అప్పటి ఐజి ఆరుళ్ ఇన్వెస్టిగేట్ చేశారు. తనని చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లోనే జైల్లో నుంచి పారిపోతానని అప్పట్లో టైగర్ శపథం చేశాడు. అన్న చెబుతున్నా వినకుండా అతను అన్నమాట ప్రకారం పోలీసులను కొట్టి జైలు నుంచి పారిపోయి ముప్పుతిప్పలు పెట్టాడు.

దాంతోపాటు వచ్చే నెలలో సిటీలోనే నేరం చేస్తాను దమ్ముంటే పట్టుకోమంటూ వారిని శపథం చేసి మరి.. ఆ నెలలోనే మూడు చోట్ల మద్రాసులో దొంగతనానికి పాల్పడి పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. అతని పట్టుకోవడానికి ఎంత‌ ప్రయత్నించినా ఐజి ఆరుళ్ నిజంగానే వాడు ఆంధ్ర టైగర్ అంటూ బిరుదు ఇచ్చాడు. అప్పటినుంచి నాగేశ్వరరావు ఇంటిపేరు టైగర్ అయింది. అతడు చేసిన దొంగతనాల్లో 1974లో జరిగిన బసగానపల్లె బ్యాంక్ దోపిడి ఒకటి. పోలీస్ స్టేషన్ కు చాలా దగ్గరలో ఉన్న ఈ బ్యాంక్ ను నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది.

Auspicious Occasion For Tiger Nageswara Rao's Opening

గ్రామాన్ని చుట్టుముట్టి మ‌రి పోలీసులు ప్రభాకర్ రావును మాత్రం ప‌ట్టుకోగ‌లిగారు. నాగేశ్వరరావు మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఒక బిస్కెట్ కంపెనీ అధినేత అప్పటి హోం శాఖ సహాయ మంత్రి వియ్యంకుడి కుటుంబాన్ని దారిలో చుట్టుముట్టి మరి దొంగతనానికి పాల్పడ్డారు. అయినా నాగేశ్వరరావు పోలీసులకు దొరకకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. మ‌రో దొంగ ఆధారంతో తను ఎప్పుడూ ఒక అమ్మాయి ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాడని తెలుసుకొన్న పోలీసులు ఆమెకు డ‌బ్బు ఆశ చూపించి.. నాగేశ్వరరావు వచ్చినప్పుడు పాలలో మొత్తం ముందు కలిపి అతడిని మాకు అప్పగించాలని లేకుంటే ఆమెను చంపేస్తామని బెదిరించారు. దాంతో ఆమె చేసేదేమీ లేక నాగేశ్వరరావు వచ్చినప్పుడు పాలలో మత్తు ముందు కలిపి ఇచ్చింది. దాంతో స్పృహ తప్పిన నాగేశ్వరరావును పోలీసులు చుట్టూ ముట్టి తుపాకుల‌తో కాల్చి ఎన్కౌంటర్ పేరు పెట్టారు.

అయితే పోస్టుమార్టం తర్వాత చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి నాగేశ్వరరావు మృతదేహాను తరలించారు. అక్కడి నుంచి ఆరంభమైన అంతిమయాత్ర స్టువర్ట్ పురం కాలనీకి చేరేందుకు మూడు రోజులు పట్టిందట. అతనికి అప్పట్లో ఉన్న ఎంతోమంది అభిమానులు చాలా రాష్ట్రాల నుంచి ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ విధంగా దోపిడీలు చేసిన నాగేశ్వరరావు తనకంటూ ఏమి ఉంచుకోలేదు. పేదలకు చ‌దువులకు, వైద్యానికి, పెళ్లిళ్లకు అంటూ ఇలా చాలా మంది పేదవారికి సహాయం చేసి మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆయన మహిళలను చాలా గౌరవించే వారట.. మహిళల దగ్గర దొంగతనాలు చేసిన ఎప్పుడూ వారి పైన ఎటువంటి ఆఘాయిత్యానికి పాల్పడేవాడు కాదట. టైగర్ నాగేశ్వర్ సోదరుడైన ప్రభాకర్ ఈ విష‌యాన్ని వెల్లడించారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Mass Maharaj, RaviTeja, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news