ఇండస్ట్రీలో ఎంద‌రు స్టార్ హీరోలున్నా.. ఏ హీరో సాధించ‌లేని ఎన్టీఆర్ అరుదైన రికార్డ్ ఇదే..!

నందమూరి కుటుంబం నుంచి మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్‌. ఆయ‌న చ‌నిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు. ఇప్పటికీ నందమూరి తారకరామారావు నటన ముందు ఏ హీరో అయినా దిగదుడుపుగానే ఉంటారు. ఆయన ఏ పాత్రలో నటించిన సహజత్వం ఉట్టిపడేది. అందుకే ఆయ‌న‌ న‌ట‌ సార్వభౌముడు అయ్యారు.

NTR Insulted For Turning Lord Krishna | cinejosh.com

అనేక రకాలైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న‌ సీనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా రాముడు భీముడు సినిమాలో ద్విపాత్రాభిన‌యం చేశారు. ఆ తర్వాత దానవీరశూరకర్ణ లో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడిగా త్రిపాత్రభినయం చేశారు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆయనే కావడం విశేషం.

تويتر \ SS Rajamouli Fans على تويتر: "@odshek @taran_adarsh They are  recreating the shoot of Dana Veera soora Karna starring NTR sr. His father.  The film is directed by NTR himself, lauded

ఆ తర్వాత రిలీజ్ అయిన శ్రీమద్విరాటపర్వం సినిమాలో ఎన్టీఆర్ ఐదు పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాల్లో బ్రహ్మన్న, కృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు పాత్రలో నటించి తన అభినయాన్ని చాటుకున్నాడు. ఒకే సినిమాలో ఐదు పాత్రలో తను నట విశ్వ‌రూపాన్ని చూపించడం అనేది సాధారణ విషయం కాదు. ఇది సీనియర్ ఎన్టీఆర్ రికార్డ్ అనే చెపాలి.

Telangana: TRS leaders demand Bharat Ratna award for Sr NTR

 

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా ఇప్ప‌టికి కూడా సీనియర్ ఎన్టీఆర్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాలో రావణాసుర పాత్రలో నటించి.. విలన్ రోల్ లో కూడా ఆయనకు ఎవరు సాటిరారని నిరూపించుకున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాలో కూడా నటించారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, sr.ntr, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news