రష్మిక అంత చిన్న వయసులోనే ఇన్ని కోట్లు సంపాదించిందా.. లెక్క‌లు చూస్తే క‌ళ్లు జిగేల్‌..!

క‌న్న‌డ కిరాక్ పార్టీ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి 2016లో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మంద‌న్న‌. ప్ర‌స్తుతం వరుస సినిమాలతో దూసుకు వెళుతోంది. సినిమా ఇండస్ట్రీలో నిలదిక్కుకొవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కష్టంతో పాటు ఎంతో కొంత లక్ కూడా ఉండాలి. రష్మికకు లక్ బాగా ఉంది. ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. నేషనల్ క్రష్ అయిన రష్మిక అందం, అభినయంతో పాటు ఘాటు ఫోటోషూట్లతో తన అభిమానాన్ని కోట్లలోనే పెంచుకుంటోంది.

Rashmika Mandanna Height, Age, Family, Wiki, News, Videos, Discussion & More

 

ఈమె ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఇప్పటివరకు 15 సినిమాల్లో నటించిన రష్మిక కథలు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలా ప్రస్తుతం తాను నితిన్‌కు జోడీగా తెరకెక్కనున్న సినిమాలో నటించడంతో పాటు పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తుంది. రష్మిక తన 27 సంవత్సరాల వయసులోనే ఎన్నో విలువైన ఆస్తులను కూడా కూడ బెట్టుకుంది.

Rashmika Mandanna | Most beautiful indian actress, Indian actress pics,  South indian actress photo

ప్ర‌స్తుతం ఆమె ఆస్తుల విలువ రు. 70 కోట్ల‌కు పైనే ఉండొచ్చ‌ని అంచ‌నా. ర‌ష్మిక‌ ప్రతి సినిమాకు రు. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. సినిమాల ద్వారా సంవత్సరానికి రు. 10 కోట్ల వరకు సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ. రష్మిక సినిమాలతో పాటు యాడ్స్ లోను మోడలింగ్ ద్వారా కూడా సంపాద‌న పెంచుకుంటుంది. చాలా త‌క్కువ టైంలోనే ర‌ష్మిక బాగానే సంపాదించింద‌నే చెప్పాలి. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు బాగా ఉన్నాయి.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Rashmika Mandanna, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news