మాస్ క్లాస్ స్టెప్పులతో కేక పుట్టించిన రామ్- శ్రీలీల.. ఎవరూ తగ్గలేదుగా ఇది కదా కావాల్సింది..!

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కందా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్లను మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాలోని నీ చుట్టూ నీ చుట్టూ తిరగనా అనే లిరికల్ పాటని ఈరోజు రిలీజ్ చేశారు.

మంచి ఫాస్ట్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆల‌రిస్తుంది. మరోవైపు డాన్స్ ప్రేమికుల్ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే యంగ్ హీరో రామ్ ఎంత మంచి డాన్సర్ అనేది అందరికీ తెలిసింది. అతనికి శ్రీ లీల లాంటి ఊర‌ మాస్ డాన్సర్ తోడైతే ఆ కాంబో ఈ పాటలనే ఉంటుంది. మాస్ క్లాస్ స్టెప్పులతో ఇద్దరు పోటీపడ్డారు.

ఇక ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మరో లెవల్ కు వెళుతుంది. సెప్టెంబర్ 15న థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలిజ్‌ కానుంది. మరి వరుస ప్లాప్‌లో ఉన్న రామ్‌కు బోయపాటి ఎలాంటి హెట్ ఇస్తారో చూడాలి.