నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది అంటూ సీక్రెట్ బయటపెట్టిన రష్మిక షాక్ లో అభిమానులు..!

ఈ రీసెంట్ టైమ్స్ లో స్టార్ హీరోయిన్లు.. ఎవరు ఊహించిన విధంగా వారి అభిమానులకు ఎలాంటి షాక్ లు ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది హీరోయిన్లు అయితే చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకుంటే.. మరికొందరు చెప్పకుండానే ప్రెగ్నెన్సీ విషయాన్నీ కూడా దాచి పెడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ఆడ్ అయిపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. మనందరికి తెలిసింది చిత్ర పరిశ్ర‌లో రష్మిక మందన్నాకు ఎలాంటి క్రేజ్ ఉందో.

కాగా రీసెంట్ గా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్న సరే ఇండస్ట్రీలో ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. దాని అంతటికీ కారణం ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉండటమే అంటూ తెలుస్తుంది. ఇదే సమయంలో సరికొత్త కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనలోని నటను బయటపడుతుంది రష్మిక .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల ముందు ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి వెళ్లిన ఈమె తన పెళ్లిపై ఎవరు ఊహించని షాకింగ్ కామెంట్లు చేసింది.

ఈ క్రమంలోని అక్కడ ఓ హోస్ట్ సరదాగా అడిగిన ప్రశ్నలకు.. నాకు నరుటోతో ఎప్పుడో పెళ్లి అయిపోయింది నా మనసులో అతడే ఉన్నాడు అంటూ రష్మిక ఫన్నీగా కామెంట్స్ చేసింది. దీంతో జనాలు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. నరుటి అంటే ఎవరు తెలియని వాళ్ళు ఆ నరుటి ఎవరూ అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే న‌రుటి అంటే ఎవరో కాదు ఎంతో ఫేమస్ అయినటు వంటి ఎనిమి సిరీస్ లోని ఒక పాత్ర పేరు.

అదే విధంగా ఆ పాత్రకి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే అందులో రష్మిక కూడా ఒకరు కావచ్చు.. అందుకే రష్మిక నాకు నరుటితో పెళ్లి అయిపోయింది అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అయితే జనాలు మాత్రం ఈమె నాకు పెళ్లయిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా వారి గుండె ఆగిపోయినంత పని అయింది.. తర్వాత అస్సలు విషయం తెలుసుకుని అందరూ రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.