బాహుబ‌లి 2ను కాపీ కొడుతోన్న పుష్ప 2… భ‌లే స్కెచ్ వేశారే…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా సూప‌ర్ హిట్‌. త్వ‌ర‌లోనే పుష్ప 2 సినిమా కూడా రానుంది. ఈ పుష్ప 2 సినిమా కోసం రాజ‌మౌళి బాహుబ‌లి 2 ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఎస్‌. ఇప్పుడు పుష్ప 2 స్ట్రాట‌జీలు అన్నీ అలాగే ఉన్నాయి. ఇక పుష్ప సినిమాను ఆసక్తికరంగా ముగించాడు దర్శకుడు సుకుమార్. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య జరిగే ఫైట్ సీన్‌తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. క్లైమాక్స్‌లో షెకావత్ కు అదిరిపోయే స్టైల్లో పుష్ప వార్నింగ్ ఉంటుంది.

Baahubali 2 - The Conclusion - EP by M. M. Keeravani | Spotify

ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో మెయిన్ లైన్ చూస్తే పుష్పరాజ్ పై షెకావత్ పగ తీర్చుకోవడం, పుష్పరాజ్ దాన్ని ఎలా ? తిప్పికొట్టాడనేది ఉంటుంది. ఈ క్ర‌మంలోనే నిన్న ప్రి టీజ‌ర్ రిలీజ్ చేశారు. పుష్ప‌రాజ్ అరెస్టు అవుతాడు. తిరుప‌తి జైలు నుంచి ఎలా ? త‌ప్పించుకున్నాడ‌న్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్క‌నుందన్నది క్లారిటీ అయితే వ‌చ్చేసింది.

ఇక పుష్ప‌రాజ్ అరెస్టు కావ‌డం, అత‌డికి బుల్లెట్ గాయాలు కావ‌డం, అయితే పుష్ప‌రాజ్ ఎక్క‌డున్నాడ‌నే విష‌యం ఎవ్వ‌రు క‌నిపెట్ట‌లేక‌పోవ‌డం దీంతో ‘అసలు పుష్ప ఎక్కడ’ అనే ఇంట్రెస్టింగ్ లాక్‌తో వీడియోను ఎండ్ చేశారు. ఇక ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిందే అని వీడియోలో చివ‌ర‌న చెప్పారు.

Pushpa: The Rule) Pushpa 2 full movie release date, cast, budget - Fast To  Tech -

ఇక ఓవ‌రాల్‌గా పుష్ప 2 ప్ర‌మోష‌న్లు, స్ట్రాట‌జీలు చూస్తుంటే బాహుబ‌లి 2 స్ట్రాట‌జీయే వాడుతున్న‌ట్టు తెలుస్తోంది. బాహుబ‌లిని కట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న హుక్ లైన్ ఆ సినిమాను రిలీజ్‌కు ముందే దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డికో తీసుకువెళ్లింది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వేర్ ఈజ్ పుష్ప అన్న‌ది ఎలా వైర‌ల్ చేయించాలో బాగా తెలుసు.

పుష్ప సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఆ సినిమా డైలాగులు, మేన‌రిజ‌మ్స్ క్రికెట‌ర్లు, రాజ‌కీయ నాయ‌కులు బాగా వాడుకున్నారు. అంత పెద్ద హిట్ సినిమాకు పార్ట్ 2 వ‌స్తుందంటే ప్ర‌చారం ఓ రేంజ్‌లో ఉండాలి. అందుకోసం స‌రికొత్త ఎత్తుగ‌డ‌లు కావాల్సిందే..!

Tags: AlluArjun, bunny, film news, filmy updates, intresting news, latest news, latest viral news, Prabhas, social media, social media post, Star hero, telugu news, Tollywood, trendy news, viral news