పల్లా – గంటా సీట్లను చంద్ర‌బాబు అందుకే తేల్చ‌డం లేదా…!

నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం దక్కించుకోవాలనే కసితో టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి గెలవకపోతే టి‌డి‌పి పరిస్తితి దారుణంగా తయారవుతుంది. అందుకే ఎలాగైనా పార్టీని గెలిపించుకునే దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలోనే గతానికి భిన్నంగా బాబు రాజకీయం ఉంది..ఈ సారి మొహమాటనికి వెళ్ళడం లేదు..పనిచేయని నేతలు ఉంటే వారికి సీట్లు ఇవ్వనని చెప్పేస్తున్నారు.

Andhra Pradesh: TDP MLA Ganta Srinivasa Rao Requests Speaker To Accept His  Resignation

అలాగే ఎన్నికలకు ముందే దాదాపు అభ్యర్ధులని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలా స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖలో కూడా కొందరు నేతలకు సీట్లపై క్లారిటీ ఇచ్చేశారు. విశాఖ ఈస్ట్ లో వెలగపూడి రామకృష్ణ, వెస్ట్ లో గణబాబు, నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, పాయకరావుపేటలో వంగలపూడి అనిత, పాడేరులో గిడ్డి ఈశ్వరి, పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి ఇలా కొన్ని సీట్లని ఫిక్స్ చేశారు.

GVMC officials demolished TDP former MLA Palla Srinivasa Rao's building -  TeluguBulletin.com

సీనియర్ నేతలైన గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు సీట్ల విషయంలో క్లారిటీ రావడం లేదు. గత ఎన్నికల్లో గంటా విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన ప్రస్తుతం నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అదే సీటులో మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వైసీపీ బలపడింది. దీంతో గంటా సీటు మార్చుకోవడం ఖాయం..అయితే భీమిలికి వెళ్తారా ? లేక అనకాపల్లికి వెళ్తారా ? అనేది క్లారిటీ లేదు. చంద్రబాబు కూడా గంటా సీటుపై క్లారిటీ ఇవ్వలేదు.

Come and see people's response to TDP meets: Chandrababu to Jagan- The New  Indian Express

ఇటు పల్లా..గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే జనసేనతో గాని పొత్తు ఉంటే గాజువాక సీటు ఆ పార్టీ తీసుకుంటుందనే ప్రచారం ఉంది. దీంతో పల్లాకు ఏ సీటు ఇస్తారనేది క్లారిటీ రావడం లేదు. మొత్తానికి ఈ ఇద్దరు సీనియర్ల సీట్ల విషయం ఇంకా తేలలేదు.

Tags: AP, ap politics, gantta srinibvas, intresting news, latest news, latest viral news, palla, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp