వైసీపీ ఎమ్మెల్యే కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు… మండిప‌డుతోన్న ద‌ళిత సంఘాలు..!

బాపట్ల వైసిపి ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ఇప్పుడు ఆయనకు మైనస్ గా మారుతున్నాయి. తాజాగా కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల పార్లమెంటు ఎస్సీల‌కు రిజర్వుడు కావడం దురదృష్టకరమని.. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బాపట్ల పార్లమెంట్లో కలిపారని.. లేకపోతే పొన్నూరుతో కలిసి బాపట్ల ఓసి పార్లమెంటుగా ఉండేదని కోన రఘుపతి చెప్పారు. బాపట్ల జిల్లా ఏర్పడి ఏడాదైన సందర్భంగా చేసిన ఆవిర్భావ వేడుకల్లో కోన చేసిన కామెంట్లు ఇప్పుడు వివాదంగా మారాయి.

Kona Raghupathi Biography, Family, Political Career & More

నెల్లూరు పార్లమెంటు సీటును ఓసీ చేయడానికి.. బాపట్ల ఎస్సీలకు రిజర్వ్ చేశారని కోన చెప్పారు. నెల్లూరు ఎస్సీల‌కు రిజర్వుగా ఉంటే దానిని బాపట్లకు మార్చి నెల్లూరును ఓసీలకు రిజర్వ్ చేశారని కోన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సంతనూతలపాడును బాపట్ల పార్లమెంటుకు కలిపి పొన్నూరును తీసుకువెళ్లి గుంటూరు పార్లమెంట్లో కలిపారు అన్నారు. లేకపోతే పొన్నూరుతో కలిసి బాపట్ల పార్లమెంట్ జిల్లాగా ఏర్పడేదని.. బాపట్ల లోక్‌స‌భ సీటు ఎస్సీలకు రిజర్వ్ కావడం చారిత్రక తప్పిదంగా కోన రఘుపతి వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో నియోజకవర్గాల పునర్విభ‌జ‌న‌ కమిటీలో ఉన్న జేడీ శీలం కీలకపాత్ర పోషించారని కూడా రఘుపతి ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దళిత వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోన రఘుపతి వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

అక్క‌డ 20 ఏళ్లుగా టీడీపీ జోరు నిల్‌… 4 నెల‌ల్లోనే టాప్ గేర్‌వేసిన లీడ‌ర్  ఎవ‌రు..! | Manalokam

బాపట్ల లోక్సభ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడం చారిత్రక తప్పిదమంటూ వ్యాఖ్యానించడం సరికాదని.. బాపట్ల నియోజకవర్గంలో దళితుల ఓట్లతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. వారిని అవమానించే మాట్లాడటం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. వెంటనే కోన క్షమాపణలు చెప్పాలని.. ఆయన క్షమాపణ చెప్పేవరకు తాము నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి వేగేశ‌న నరేంద్ర వర్మ దీనిపై కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

భారత రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కుల ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తుంటే.. కోన రఘుపతి వ్యాఖ్యలు దళితులు రాజకీయంగా ఎదగకూడదు అనేలా ఉన్నాయని విమర్శలు చేశారు. దళితుల పార్టీ అని ప్రగ‌ల్భాలు పలికే వైసీపీ నిజస్వరూపం ఎలా ? ఉంటుందో కోన మాటలు బట్టి అర్థమవుతుందని.. దళితులు ఎప్పుడు మీ కింద బానిసలుగా ఉండాలా ? వారు రాజకీయంగా అభివృద్ధి చెందకూడడా ? ఇదేనా మీ ఉద్దేశం అని నరేంద్ర వర్మ విమర్శించారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp