ప్రశాంత్ నీల్ పుట్టినరోజు.. ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ చూస్తే మతులు పోవాల్సిందే..అద్దిరిపోయింది “బ్రో”..!!

కన్నడ స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు నిన్న ..ఆయన తన పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. కేజీఎఫ్ చిత్రాలతో ఇండియన్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకుని స్టార్ డైరెక్టర్గా మారిపోయిన ప్రశాంత్ నీల్ బర్త్డే వేడుకలను హీరో ప్రభాస్ ఎంతో ఘనంగా నిర్వహించారు. సలార్ సినిమా సెట్స్ లో పలు రకాల కేకులను కట్ చేస్తూ ఆయనకు ఎంతో ఇష్టమైన అమ్మ సెంటిమెంట్ ఉన్న బొమ్మను సైతం గిఫ్ట్ చేశారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ప్రశాంత్ నీల్ కి స్పెషల్గా బర్త్డే విషెస్ తెలియజేశారు . “హ్యాపీ బర్త్డే బ్రదర్ ” అంటూ ఎంతో ప్రేమ గా ట్వీట్ చేశారు . అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆయనకు స్పెషల్ విష్ చేశారు. అంతేకాదు ఏకంగా ఆయనకి ఇష్టమైన నాటుకోడి కూరను ఓన్ గా చేసి పంపించి బర్త డే ను మరింత స్పెషల్ గా మార్చారట .

ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది . “థాంక్యూ అన్నయ్య” అంటూ ఎన్టీఆర్ పంపిన డెలిషియస్ నాటుకోడి కూర పోస్ట్ చేస్తూ క్యాప్షన్ పెట్టింది . దీనితో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. దేవర సినిమా తరువాత తారక్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే నటించబోతున్నాడు. ఈ సినిమా పై కూడా జనాలు హ్యూజ్ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు..!!