ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మ‌రోసారి రేణుదేశాయ్‌..

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, న‌టి రేణుదేశాయ్ మ‌ధ్య కెమిస్ర్టి ఎంత క్రేజీగా ఉంటుందో తెలిసిందే. విడిపోయినా గాని తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ కపుల్స్‌లో వారి జంట కూడా ఒక‌టి. వాళ్ల‌కు సంబంధించిన విష‌య‌మేదైనా హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. అభిమానులు మ‌రింత ఆస‌క్తి చూపుతుంటారు. అలాంటి వార్త ఇప్పుడు ఒక‌టి మ‌ళ్లీ బ‌య‌టికొచ్చింది. మ‌ళ్లీ వారిద్ద‌రూ క‌లిసే అవ‌కాశ‌ముంద‌ని టాలివుడ్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అదే వార్త చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

ఇక వారిద్ద‌రూ గ‌తంలో జోడిగా న‌టించిన బద్రి సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా సమయంలోనే ప్రేమించుకోవ‌డం, సహజీవనం చేయ‌డం మొదలుపెట్టారు. ఆ తర్వాత జాని సినిమాలోనూ వారిద్ద‌రూ నటించినా ఆ చిత్రం చేదు ఫ‌లితాన్ని ఇచ్చింది. అయింది. అప్పటికే ఈ ఇద్దరూ ప్రేమలో ఉండటం.. కలిసి బతకడం కూడా మొదలు పెట్టడంతో సినిమాలకు దూరమైంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు డిజైనర్‌గా వర్క్ చేస్తూ తెరవెనకే ప‌రిమిత‌మైంది. ఆయన నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాలకు చేరువైంది ఆ భామ‌. దర్శకురాలిగా.. రచయితగా ఇప్ప‌టికే త‌న సత్తా చాటుకుంది రేణు. తిరిగి ఆన్ స్ర్కీన్ మీద కూడా కనిపించడానికి సిద్ధమవుతుంది. ఈ మధ్యే విడుదలైన ‘చూసి చూడంగానే’ చిత్రంలో హీరో తల్లి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చినా.. ఆరోగ్య సమస్య వల్ల చేయలేకపోయానని చెప్పి త‌న రీ ఎంట్రీ అవ‌కాశాల‌ను వెల్ల‌డించింది. రేణు దేశాయ్.

తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న పింక్ రీమేక్‌లో రేణు దేశాయ్ నటించబోతుందనే స‌మాచారం. ఆ చిత్రంలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌కి తల్లిగా రేణు కనిపించనున్నట్టు తెలుస్తున్న‌ది. ఈ మేర‌కు చిత్ర బృందం ఆమెతో సంప్ర‌దింపులు కూడా జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఒకవేళ అవి ఫ‌లిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంది..?

Tags: Dil Raju, Pawan kalyan, pink telugu remake movie, Renudesai