షాక్‌: వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ డుమ్మా… అస‌లేంటి కార‌ణం…!

మెగా అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సొట్టబుగ్గల హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎట్టకేలకు అధికారికి ప్రకటన రానే వచ్చేసింది. గత రెండు నెలల నుంచి వీరిద్దరి ఎంగేజ్మెంట్, పెళ్లిపై తెలుగు సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు రేపు అంటే జూన్ 9వ తేదీన వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాదులోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

మెగా కుటుంబానికి చెందిన సన్నిహితులు బంధుమిత్రులు, కొందరు సినిమా ప్రముఖులు ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరుకానున్నా. వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ వేడుక ఇన్విటేషన్ కార్డు కూడా బయటకు వచ్చింది. జనసేన – మెగా ఫ్యామిలీ అభిమానులు ఈ ఎంగేజ్మెంట్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈనెల 14 నుంచి జనసేనని వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓవైపు వరుసగా సినిమాల షూటింగ్ లతో పాటు, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వారాహి యాత్ర ప్రారంభమైతే పవన్ కళ్యాణ్ కు అస్సలు ఖాళీ ఉండే ఛాన్సులే లేవు. పైగా ఏపీలో మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇప్పటికీ ఇటు పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో పవనకు అస్సలు క్షణం కూడా తీరిక ఉండేలా లేదు. ఇక వరుణ్ – లావణ్య పెళ్లి ఈనెల 23న జరగనుందని తెలుస్తోంది. అప్పటికే పొలిటికల్ టూర్ లో బిజీగా ఉండే పవన్ ఈ పెళ్లికి వస్తాడా లేదా కష్టమైనా అన్నది చూడాలి. ఒక‌వేళ ప‌వ‌న్ ఈ పెళ్లికి రాక‌పోతే మెగా ఫ్యాన్స్‌లో అస్సులు జోషే ఉండ‌దు.

Tags: Actress Lavanya Tripathi, celebrities news, janasena, latest film news, latest filmy updates, latest news, Pawan kalyan, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, varun tej, viral news