బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి..హౌస్ లో మిడ్ నైట్ కూడా.. మంచి మసాలా ఇచ్చారుగా..!

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ ఎన్నో భాషలలో సూపర్ హిట్ అయ్యింది.. ఈ బిగ్ బాస్ షో తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది.. ఈ ప్రధానంగా ఇప్పటికే ఆరు సీజన్లో కంప్లీట్ చేసుకున్న ఈ షో త్వరలోనే ఏడో సీజన్లో అడుగుపెట్టబోతుంది. అయితే ఇప్పటివరకు హోస్ట్‌గా చేసిన నాగార్జున ఈసారి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో రానా లేదా నట‌సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఏడో సీజన్ బిగ్ బాస్ రూల్స్ మొత్తం పూర్తిగా మారినట్టు తెలుస్తుంది.. గత సీజన్ లో ఎలిమినేట్ అయిన వెంటనే కంటెస్టెంట్ బయటికి వచ్చేసేవారు.. ఇప్పుడు వచ్చే సీజన్లో ఈ రూల్ ని మార్చేశారట. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తో కూడా టిఆర్పిల కోసం సరికొత్త గేమ్స్ ను క్రియేట్ చేశారట. అంతేకాకుండా ఈసారి హౌస్ లోకి డైవర్స్ తీసుకున్న ఓ జంటను సీక్రెట్ రూమ్ లో పెట్టి షో ని సరికొత్త మలుపు తిప్పబోతున్నారనే ఓ వార్త వైరల్ గా మారింది.

అంతేకాకుండా రెమ్యూనరేషన్ పరంగా కూడా ఈసారి భారీగానే ముట్ట చెబుతున్నారట.. అంతేకాకుండా స్టార్ సెలబ్రిటీస్ ని, స్టార్ సింగర్స్ ని ఈ సీజన్లోకి అడుగుపెట్టేలా బిగ్ బాస్ నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారట.. మరియు ప్రధానంగా ఈసారి హైలెట్ ఏమిటంటే.. అర్ధరాత్రి కూడా కొన్ని టాస్క్ లు ఇచ్చి ఆ టాస్క్ ను లైవ్ లో బిగ్ బాస్ మేనేజ్మెంట్ టెలికాస్ట్ చేయనున్నారుట.

గత ఆరు సీజన్లు బిగ్ బాస్ ఒక గంట టెలికాస్ట్ అయ్యేలా వచ్చేది.. అయితే ఈ సీజన్ మాత్రం మిడ్ నైట్ కూడా ఓ గంట టెలికాస్ట్ అయ్యేలా ఓ కొత్త ఆలోచన చేస్తున్నారట.. ఇక ఇప్పుడు దీంతో ఈ హౌస్ లో ఆర్థ‌రాత్రి కూడా ఏం జరుగుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటారు.. ఇక దీంతో ఈసారి బిగ్ బాస్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారని చెప్పవచ్చు..!!

Tags: biggboss 7, celebrities news, latest film news, latest filmy updates, latest news, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news