నీ కూతుర్ని లేపుకుపోతా అంటూ కాలేజ్ డేస్‌లో బ‌న్నీ వార్నింగ్ ఎవ‌రికో తెలుసా…!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నట వారసుడిగా టాలీవుడ్‌లో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. 2021 చివరలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కొట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప2 సినిమా కూడా ఒకటి.

రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ కూడా వచ్చి మరోసారి ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే గతంలో అల్లు అరవింద్ అల్లు అర్జున్ గురించి తండ్రి అర‌వింద్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ‌తంలో జ‌రిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఇంటర్ చదివే రోజుల్లో చేసిన ఓ సంఘటన గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.

అల్లు అర్జున్ హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒకరోజు కాలేజ్ నుంచి అల్లు అరవింద్ కు ఫోన్ వచ్చిందట. మీ అబ్బాయి స్టడీ మార్కుల గురించి మాట్లాడాలి ఒకసారి మీరు కాలేజీకి రండి అని ప్రిన్సిపాల్ చెప్పారట. మరుసటి రోజు అల్లు అరవింద్ బన్నీని తీసుకుని కాలేజీకి వెళ్లారట. ప్రిన్సిపాల్ రూమ్ దగ్గర బన్నీ మార్క్ లిస్ట్‌ అల్లు అరవింద్‌కి ఇచ్చారట. అల్లు అర్జున్ మార్కులు చూసి అల్లు అవింద్‌ ఒక్కసారిగా షాక్ అయ్యారట.

ఒక్క సబ్జెక్టులో కూడా 50 మార్కులు దాటలేదట. ప్రిన్సిపాల్ ఇక‌ వాయి తీసేస్తారని డిసైడ్ అయిన అల్లు అరవింద్ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడట. ప్రిన్సిపాల్ ఆ మార్క్ లిస్ట్ చూసి ఏం మాట్లాడకుండా అల్లు అరవింద్ గారిని వెళ్ళిపోమన్నారట. త‌న‌ను ర‌మ్మ‌ని కూడా ప్రిన్సిపాల్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడో కూడా అర‌వింద్‌కు అర్థం కాలేద‌ట‌. అయితే బ‌న్నీ ఫ్రెండ్స్ ద్వారా అక్క‌డ జ‌రిగిన విష‌యం తెలుసుకున్నార‌ట‌.

బ‌న్నీ ఆ ప్రిన్సిపాల్ కి అప్ప‌ట్లోనే సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడట. మా ఫాదర్ కాలేజీకి వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడకుండా ? సైలెంట్ గా ఉండాలి… లేకపోతే మీ కూతుర్ని లేపుకు పోతానంటూ ప్రిన్సిపాల్ కి ధ‌మ్కీ ఇచ్చాడట. దాంతో భయపడిపోయిన ప్రిన్సిపాల్ అరవింద్ వచ్చిన సమయంలో ఏం మాట్లాడకుండా కాలేజ్ నుంచి పంపించేశాడు. ఇదే విషయాన్ని గతంలో అల్లు అర‌వింద్‌ ఆ ఇంటర్వ్యూలో చెబుతూ అల్లు అర్జున్ చేసిన పనికి దండం పెట్టేసాడు.