పార్టీ లేదా పుష్ప: ఎన్టీఆర్.. వస్తున్న: బన్నీ.. మామూలు కిక్కు కాదు..!!

నేడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. బన్నీ తన 41 వ పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . టాలీవుడ్ స్టార్ హీరోస్ నుంచి బాలీవుడ్ ప్రముఖులు.. కోలీవుడ్ ..మాలీవుడ్ లో ఉండే స్టార్స్ అందరూ బన్నీకి స్పెషల్గా విషెస్ చెప్పారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నడిపిన హంగామా అంతా ఇంత కాదు .

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి జాన్ జిగిడి దోస్తే అయిన జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గా విష్ చేశారు . “వెరీ హ్యాపీ బర్తడే బావ ” అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేస్తూ తనపై ఉన్న ప్రేమను తెలియజేశాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ..”థాంక్యూ ఫర్ యువర్ లవ్లీ విషెస్ బావ .. వార్మ్ హగ్స్ ” అంటూ రిప్లై ఇచ్చారు .

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ట్విట్ చేస్తూ..” ఓన్లీ వార్మ్ హగ్స్ నేనా.. పార్టీ లేదా పుష్పా..?” అంటూ పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పి బన్నీ ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు . కాగా ఎన్టీఆర్ మెసేజ్ కి బన్నీ మళ్ళీ రిప్లై ఇచ్చాడు..” వస్తున్నా..” అంటూ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశాడు . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ – బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు – అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా “పార్టీ లేదా పుష్ప”..? అనే డైలాగ్ ఎన్టీఆర్ టైప్ చేయడం స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . ఏది ఏమైనా సరే బన్నీ – తారక్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిపే వేరు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తూ ఉండగా .. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు . రెండు సినిమాలు కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

 

 

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Pushpa, pushpa 2. pushpa raj, social media, social media post, Star hero, Star Heroine, sukumar, telugu news, Tollywood, trendy news, viral news